Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలతో తెరకెక్కింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ని తొందర్లోనే రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక డైలాగులు లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుంది.
అది ఏంటి అంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ తో ఒక భారీ డైలాగ్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ డైలాగు ఏ సమయంలో వస్తుంది అనేది క్లారిటీ లేదు కానీ డైలాగ్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది ఏంటి అంటే “యమ పాశం తో ఉయాల ఊగాలి అని సుస్తే, అది మెడకు సుట్టుకొని సావు ని పరిచయం చేస్తుంది”. అంటూ సాగే ఈ డైలాగు ఎన్టీఆర్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని కూడా చాలా గొప్యం గా ఉంచుతూ వస్తున్నప్పటికీ ఈ ఒక్క డైలాగ్ మాత్రం బయటికి లీక్ అయింది.
అయితే అది చిత్ర యూనిట్ చేసిందా, లేదంటే వేరే ఎవరైనా ఈ సినిమా డైలాగుని లీక్ చేశారా అనే విషయాల మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చే డైలాగు తన అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరిస్తుంది అనడంలో ఎంత మాత్రం శక్తి లేదు.ఇక ఎన్టీఆర్ లాంటి ఒక హీరో ఇలాంటి మాస్ డైలాగులు చెప్పే చాలా రోజులు అవుతుంది. కాబట్టి ఈ సినిమా మళ్లీ తనకు ఒక సూపర్ డూపర్ హిట్టును ఇస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అప్పుడప్పుడో వచ్చిన సింహాద్రి, యమదొంగ టైంలో ఇలాంటి డైలాగులు చెప్పిన ఈయన ప్రస్తుతం ఇప్పుడు పవర్ ఫుల్ డైలాగ్ తో మరొకసారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి వస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా 2024 ఏప్రిల్ లో రిలీజ్ అవుతున్న క్రమంలో ఈ సినిమాలో ఉండాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాతో తను ప్రూవ్ చేసుకుంటే తప్ప మళ్ళీ ఇండస్ట్రీలో ఆయనకు మంచి అవకాశాలుగా రావు చూడాలి మరి ఆయన ఎంతవరకు ఈ సినిమాని సక్సెస్ చేస్తాదు అనేది…