Salaar Vs Animal: సలార్ , అనిమల్ కి మధ్య పోటీ.. ఎవరు విజేత..?

ఇప్పటికీ ఈ సినిమా మీద కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నప్పటికీ ఈ సినిమాని ఆల్మోస్ట్ సక్సెస్ దాటి బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు దూసుకెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎంత నెగిటివ్ ప్రచారం చేసుకున్న కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యే దిశగా ముందుకు దూసుకెళ్తుంది.

Written By: Gopi, Updated On : December 27, 2023 10:03 am

Salaar Vs Animal

Follow us on

Salaar Vs Animal: ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ తనదైన రీతిలో సక్సెస్ లు సాధిస్తూ ఇండస్ట్రీ లో ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే సలార్ సినిమా విషయంలో ప్రభాస్ తను పెట్టిన ఎఫర్ట్ కి తగ్గ ఫలితం వచ్చిందనే చెప్పాలి. అందుకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా అనేది సూపర్ సక్సెస్ అవ్వడం ప్రభాస్ కి చాలా వరకు హెల్ప్ అయింది. ఇక ఇప్పటివరకు వరుస ఫ్లాపులతో ప్రాబ్లం లో ఉన్న ప్రభాస్ ఒక్కసారిగా సక్సెస్ ట్రాక్ ఎక్కడమే కాకుండా తను సక్సెస్ కొడితే ఏ రేంజ్ లో ఎలా ఉంటుందో ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేశాడు.

ఇక ఇప్పటికీ ఈ సినిమా మీద కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నప్పటికీ ఈ సినిమాని ఆల్మోస్ట్ సక్సెస్ దాటి బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు దూసుకెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎంత నెగిటివ్ ప్రచారం చేసుకున్న కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యే దిశగా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమం లో సలార్ కంటే ముందే రిలీజ్ అయిన అనిమల్ సినిమా 850 కోట్లకు పైన కలెక్షన్స్ ని వసూలు చేసి ముందుకు దూసుకెళ్తుంటే సలార్ సినిమా మాత్రం 4 రోజుల్లోనే 500 కోట్లకు పైన కలక్షన్లు వసూలు చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ మూవీగా ముందుకు దూసుకెళ్తుంది.

అయితే అనిమల్ కి ఈ సినిమాకి మధ్య కొంతమంది పోల్చి చూస్తున్నారు. నిజానికి అనిమల్ సినిమా స్టోరీ వేరు ఈ సినిమా స్టోరీ వేరు కాబట్టి ఏ సినిమా అయిన కూడా ఆ సినిమాకి ఇండివిజువల్ గా ఎంత కలక్షన్స్ వచ్చాయి అనే లెక్కల గురించి మాట్లాడుకోవాలి. ఇక అనిమల్ సినిమా కంప్లీట్ గా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ యు మూవీ కానీ సలర్ సినిమాల కాదు ఇది ఒక పక్క కమర్షియల్ సినిమా ఇందులో హీరోకు సంబంధించిన ఎలివేషన్స్ ఉంటాయి.

ఎమోషన్స్ తో డైరెక్టర్ ఆడుకుంటాడు కాబట్టి ఈ సినిమాని అనిమల్ సినిమాని పోల్చి చూడడమనేది కరెక్ట్ కాదు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఈ రెండు సినిమాలు కూడా ఇండివిజువల్ గా దేనికి అదే ఒక సపరేట్ జానర్ లో సాగే సినిమాలు కాబట్టి ఈ రెండు సినిమాల మీద ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి.అలాగే సలార్ సినిమా రిలీజ్ కి ముందు ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు అన్ని ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలను రీచ్ అయిందనే చెప్పాలి…