Lavanya Tripathi: తాటిపండు అంత టాలెంట్ ఉన్న లావణ్యకు ఆవగింజ కూడా అదృష్టం లేదు. అమ్మడుకున్న అందం, టాలెంట్ కి స్టార్ గా వెలిగిపోతుంది అనుకుంటే.. ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. వరుస పరాజయాలు ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేశాయి. 2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా చిత్రం తర్వాత ఆమెకు హిట్ దక్కలేదు. 2019లో విడుదలైన అర్జున్ సురవరం పర్వాలేదు అనిపించుకుంది. ఈ మూవీ తర్వాత ఆమె నటించిన చిత్రాలు ఏ వన్ ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

లావణ్య హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ. ఒక హిట్ పడితే వరుసగా నాలుగు ప్లాప్స్ పడేవి. డెబ్యూ మూవీ అందాల రాక్షసి చిత్రంతో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్న లావణ్య అది కంటిన్యూ చేయలేకపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో చెప్పుకోదగ్గ ఆఫర్స్ లేవు. బర్త్ డే రోజున ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. కనీసం టూ టైర్ హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఖాళీగా ఉన్న లావణ్య చేసేదేమీ లేక విహారాలు చేస్తుంది. ప్రపంచంలో తనకు నచ్చిన అందమైన ప్రదేశాల్లో విహరిస్తోంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోస్ ప్రకారం టర్కీ దేశంలో ఉన్నారు.
Also Read: Ballaya Heroine: ప్రైవేట్ పార్ట్స్ కి సర్జరీలు చేయించుకొమ్మన్నారు… బాలయ్య హీరోయిన్ సంచలన కామెంట్స్
ఆ మధ్య హీరో వరుణ్ తేజ్- లావణ్య మధ్య లవ్ ఎఫైర్ అంటూ వార్తలు వచ్చాయి. ఏకంగా వీరిద్దరూ పెళ్ళికి రెడీ అయ్యారంటూ కథనాలు వెలువడ్డాయి. లావణ్య కోసం ఖరీదైన రింగ్ తీసుకొని వరుణ్ బెంగుళూరు వెళ్లారని, కాసేపట్లో వాళ్ళ పెళ్లి ప్రకటన రానుందని వార్తలు పుట్టుకొచ్చాయి. నిహారిక పెళ్లి రాజస్థాన్ లో జరుగగా… లావణ్య హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ మినహాయించి పరిశ్రమ నుండి ఎవరికీ ఈ పెళ్ళికి ఆహ్వానం లేదు. ఈ క్రమంలో పుకార్లు నిజమే అని అందరూ నమ్మారు. అయితే అలాంటి ప్రకటనేమీ రాలేదు. అదే సమయంలో ఈ విషయాన్ని ఎవరూ ఖండించలేదు. కాబట్టి వరుణ్-లావణ్య ప్రేమ కథను కొట్టిపారేయలేం అంటున్నారు కొందరు.

మిస్టర్ మూవీలో వరుణ్, లావణ్య కలిసి నటించారు. ఇక దీనికి కాలమే సమాధానం చెప్పాలి. కాగా గని మూవీతో దెబ్బతిన్న వరుణ్… ఎఫ్3 విజయంతో కోలుకున్నాడు. నెక్స్ట్ ఆయన మరో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: Case Against Nayanthara: పెళ్ళై 24 గంటలు కాకుండానే నయనతారపై కేసు?.. నూతన దంపతులకు బిగ్ షాక్!