Lavanya Tripathi Say No To Nagarjuna: అందాల రాక్షసి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా అందాల తార లావణ్య త్రిపాఠి..తొలి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న లావణ్య త్రిపాఠి..ఆ తర్వాత వరుసగా క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకుంటూ టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా చేరిపోయింది..అంతే కాకుండా మెగా ఫామిలీ హీరోలతో కూడా వరుసగా సినిమాలు చేసి, వరుణ్ తేజ్ తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ రూమర్స్ కి కూడా ఎక్కినా సంగతి మన అందరికి తెలిసిందే..దీనిపై ఆమె ఇటీవలే ‘వాటిల్లో నిజం లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చిన కూడా ఇచ్చింది..ఇది ఇలా ఉండగా 2016 వ సంవత్సరం లో అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..చాలా కాలం నుండి సరైన హిట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న నాగార్జున కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చింది ఈ సినిమా..అప్పట్లోనే ఈ సినిమా దాదాపుగా 50 కోట్ల రూపాయిల వరుకు షేర్ ని రాబట్టింది.

Also Read: YS Vijayamma: అమ్మ రాజీనామా!.. షర్మిలకే జై.. జగన్ కు నై.. వైఎస్సార్‌సీపీకి విజయమ్మ గుడ్‌బై!
ఈ సినిమాకి సీక్వెల్ గా ఏడాది ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు’ గా మన ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే..అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సుమారు 40 కోట్ల రూపాయిల వరుకు షేర్ ని సాధించి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..అయితే ఈ సినిమా లో లావణ్య త్రిపాఠి పాత్ర కనిపించదు..ఈ విషయాన్నే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో లావణ్య త్రిపాఠి ని అడగగా, ఆమె దానికి సమాధానం చెప్తూ ‘ఈ సినిమాలో ఈ పాత్ర కోసం నాగార్జున గారు స్వయంగా నాకు కాల్ చేసి అడిగారు..బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య కి తల్లిగా నటించాలన్నారు..నేను అది వినగానే షాక్ కి గురై..నేను నాగ చైతన్య కి తల్లిగా నటించడం ఏంటి..సారీ సర్..నేను చెయ్యలేను అని నాగార్జున గారి మొహం మీదనే చెప్పేసాను’ అంటూ చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి..ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘హ్యాపీ బర్త్డే’ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనం గా విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా చాలా ఇంటర్వూస్ ఇచ్చింది లావణ్య..అందులో భాగంగానే ఈ కామెంట్స్ చేసింది.

Also Read: Mahesh Babu Pooja Hegde: మహేష్ కి చుక్కలు చూపిస్తున్న హీరోయిన్ పూజ హెగ్డే