Varuntej – Lavanya Tripathi : ఎప్పటి నుండో సోషల్ మీడియా లో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ట్రేండింగ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు చాలా కాలం నుండి ప్రేమించుకుంటున్నారని, ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చని. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని ఫ్యాన్స్ మొదట్లో అసలు నమ్మలేదు. కానీ నిన్న వీళ్లిద్దరు నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ని ఇచ్చారు.
వీళ్ళు నిశ్చితార్థం జరుపుకున్న ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పుడు ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే గతం లో ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ని తన బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరిగా మాత్రమే చెప్పుకుంది కానీ, ఎక్కడా కూడా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ గురించి బయటపడలేదు.అంతే కాదు గతం లో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ని ఇప్పుడు సోషల్ మీడియా లో వెలికి తీస్తున్నారు ఫ్యాన్స్.
ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘హ్యాపీ బర్త్ డే’ అనే సినిమా గత ఏడాది విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ఆమె కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఆమెని యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘నీకు క్లోజ్ ఫ్రెండ్స్ లో బెస్ట్ హస్బెండ్(భర్త) మెటీరియల్ గా ఎవరు నిలుస్తారు’ అని అడగగా, దానికి లావణ్య త్రిపాఠి సమాధానం చెప్తూ ‘సాయి ధరమ్ తేజ్ బెస్ట్ హస్బెండ్ మెటీరియల్ గా నేను భావిస్తాను. వరుణ్ తేజ్ కూడా మంచోడే, కానీ నా కెరీర్ లో సాయి ధరమ్ తేజ్ లాంటి బెస్ట్ పర్సన్ ని ఇప్పటి వరకు కలవలేదు’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.
వరుణ్ తేజ్ తో ఆమె 7 ఏళ్ళ నుండి రిలేషన్ లో ఉన్నప్పటికీ, వరుణ్ తేజ్ కంటే సాయి ధరమ్ తేజ్ బెస్ట్ హస్బెండ్ మెటీరియల్ అని ఎలా అన్నది అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. ఆమె అన్న మాటలను మీరు కూడా క్రింది వీడియో లో చూడవచ్చు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Lavanya tripathi likes sai dharam tej
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com