https://oktelugu.com/

పాపం లావణ్య.. ఛాన్స్ లు కోసం మరీ ఇంతలా.. ?

హోమ్లీ గర్ల్ లావణ్య త్రిపాఠి ఛాన్స్ లు కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఛాన్స్ లు అంటే ఏదో చిన్నాచితకా హీరోలు కాదండోయ్. స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా చాన్స్ లు కావాలని తెగ ఆశ పడుతుంది లావణ్య. ‘అయినా నాకేం తక్కువా, నాకెందుకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వరు’ అని బాధ పడుతుందట. మరి లావణ్య అడిగిన దానిలో కూడా పాయింట్ ఉంది కదా. లావణ్యకి ఏమి తక్కువ, ఆ మాటకొస్తే.. చాలామంది హీరోయిన్స్ […]

Written By:
  • admin
  • , Updated On : August 2, 2021 10:42 am
    Follow us on

    Lavanya Tripathi Glamour Showహోమ్లీ గర్ల్ లావణ్య త్రిపాఠి ఛాన్స్ లు కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఛాన్స్ లు అంటే ఏదో చిన్నాచితకా హీరోలు కాదండోయ్. స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా చాన్స్ లు కావాలని తెగ ఆశ పడుతుంది లావణ్య. ‘అయినా నాకేం తక్కువా, నాకెందుకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వరు’ అని బాధ పడుతుందట. మరి లావణ్య అడిగిన దానిలో కూడా పాయింట్ ఉంది కదా.

    లావణ్యకి ఏమి తక్కువ, ఆ మాటకొస్తే.. చాలామంది హీరోయిన్స్ కంటే లావణ్య అన్నిటిలో ఎక్కువే. అందుకే, లావణ్య ఇక సైలెంట్ గా ఉండాలనుకోవడం లేదట. ఎలాగైనా ఛాన్స్ లను అందుకోవాలని తెగ ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో నిర్మాతల దగ్గర నుండి హీరోల వరకూ అందరికీ ఫోన్ చేసి మరీ ఛాన్స్ ఇవ్వండి అంటూ వేడుకుంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

    ఇక తన కెరీర్ ను మరో మూడేళ్ల నుండి నాలుగేళ్లు మాత్రమే ప్లాన్ చేసుకున్నానని, ఆ తరువాత సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని లావణ్య చెబుతుందట. అయినా కొత్తగా ప్లాన్ చేసుకునేది ఏముంది ? మరో నాలుగేళ్లు అంటే.. లావణ్యకి 35 వస్తాయి. ఇక అప్పుడు ఈ ముదురు భామను ఎవరు మాత్రం హీరోయిన్ గా పెట్టుకుంటారు. అందుకే తెలివిగా ఇలా చెబుతుంది ఈ భామ.

    పనిలో పనిగా నాలుగేళ్లు తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతానని చెబుతుంది కాబట్టి, దయ తలచి ఛాన్స్ లు ఇస్తారని లావణ్య ఆశ. అయితే, కొంతమంది డైరెక్టర్లు ‘ఈ క్యారెక్టర్స్ నువ్వు చేయలేవు అమ్మా’ అంటే.. ‘అదేం పెట్టుకోకండి..’ ఇక అందాలు ఆర‌బోయ‌డంలో తనకు ఎలాంటి హ‌ద్దులు లేవని, ‘రొమాంటిక్ సీన్స్ లో కూడా పోటీ పడి మరీ నటిస్తాను అని’, ఏ రేంజ్ రొమాన్స్ కైనా తాను సిద్ధం అని.. మొత్తానికి లావణ్య ఓపెన్ అయిపోయిందట. మరి ఛాన్స్ లు వస్తాయా ? చూడాలి.