https://oktelugu.com/

జాబ్ క్యాలెండర్ దుమారం.. మార్పులకు జగన్ రెడీ

ఆంధ్రప్రదేశ్ లోనిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించినా అందులో ఉద్యోగాలు తక్కువగా ఉండడంతో ఆశావహుల్లో నిరాశే మిగులుతోంది. దీంతో వారిలో ఆగ్రహం పెల్లుబికుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడింది. నిరుద్యోగుల్లోని నిరసనను గుర్తించి వారికి ఉద్యోగాల భర్తీపై ఆశలు పెంచే విధంగా ప్రయత్నాలు ప్రారంభించింది. జాబ్ క్యాలెండర్ మార్చే ఉద్దేశంలో ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో మరిన్ని పోస్టులు పెరిగే సూచనలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 2, 2021 / 10:30 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లోనిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించినా అందులో ఉద్యోగాలు తక్కువగా ఉండడంతో ఆశావహుల్లో నిరాశే మిగులుతోంది. దీంతో వారిలో ఆగ్రహం పెల్లుబికుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడింది. నిరుద్యోగుల్లోని నిరసనను గుర్తించి వారికి ఉద్యోగాల భర్తీపై ఆశలు పెంచే విధంగా ప్రయత్నాలు ప్రారంభించింది. జాబ్ క్యాలెండర్ మార్చే ఉద్దేశంలో ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో మరిన్ని పోస్టులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

    గతంలో ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో పదివేల ఉద్యోగాల కోసం ప్రకటన చేశారు. దీంతో ఉద్యోగాలు ఆశిస్తున్న యువత ఎంతో ఆశపడిన గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాలు సైతం పరిమితంగానే ఉండడంతో యువత రోడ్డెక్కి ఆందోళన బాట పడుతున్నారు. దీనికి పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నా అవన్ని అవాస్తవాలేనని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేయాలన్నారు.

    ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలపై వివరణ ఇచ్చినా నిరుద్యోగులకు విశ్వాసం లేకుండా పోతోంది. పోలీసు శాఖలో చాలా ఖాళీలు ఉన్నా శిక్షణ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో భర్తీ చేయడం లేదని చెబుతుండడంతో ఆ పోస్టులపై ఆశలు వదులుకుంటున్నారు. మిగిలిన శాఖల్లో ఖాళీలను గుర్తించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా ఆచరణ సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు ఆరో తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులన్ని కలిపి నిరుద్యోగుల సంతృప్తి కోసం మరిన్ని ఉద్యోగాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. గతంలో జగన్ పాదయాత్ర సమయంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని హామీ ఇవ్వడంతో నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదు. అందుకే వారిలో ఆగ్రహం పెరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలు తీర్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.