రోజుకు మూడు లక్షలు.. శ్రీముఖిలో మార్పు !

బబ్లీ యాంకర్ గా శ్రీముఖికి యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది, పైగా అతి తక్కువ కాలంలోనే ఫేమస్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న భామగా శ్రీముఖికి ఒక సెపరేట్ ఇమేజ్ ఉంది. టీవీ షో ఏదైనా ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించడానికి సాధ్యమైనంతగా ప్రయత్నం చేసే శ్రీముఖి.. ఈ మధ్య హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తోంది. అసలుకే తన లుక్స్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసే ఈ భారీ […]

Written By: admin, Updated On : August 2, 2021 10:53 am
Follow us on

బబ్లీ యాంకర్ గా శ్రీముఖికి యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది, పైగా అతి తక్కువ కాలంలోనే ఫేమస్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న భామగా శ్రీముఖికి ఒక సెపరేట్ ఇమేజ్ ఉంది. టీవీ షో ఏదైనా ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించడానికి సాధ్యమైనంతగా ప్రయత్నం చేసే శ్రీముఖి.. ఈ మధ్య హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తోంది.

అసలుకే తన లుక్స్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసే ఈ భారీ బ్యూటీకి అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి. కాకపోతే, ఆ సినిమాలు అన్ని ఊరు పేరు లేనివే. కానీ, వరుసగా వస్తోన్న సినిమా ఆఫర్లను క్యాష్ చేసుకోవడానికి ఏ ఛాన్స్ వదులుకోకుండా రెచ్చిపోయి మరీ శ్రీముఖి సినిమాలకు సైన్ చేస్తోంది. సినిమాకు ఏభై లక్షల వరకూ ఇస్తామంటున్నారు మేకర్స్.

పైగా శ్రీముఖి సిబ్బందికి, అలాగే మిగిలిన చిల్లర ఖర్చులు అవి ఇవి కలిపి మొత్తంగా లక్ష వరకూ రోజుకు అదనపు సొమ్ము ఇస్తారు. ఇక షూటింగ్ డేట్స్ కూడా మహా ఐతే ముప్పై రోజులకు మించవు. అంటే.. రోజుకు శ్రీముఖికి మూడు లక్షలు గిట్టుబాటు అవుతుంది అన్నమాట. అదే షోకి అయితే లక్షకి మించి ఎక్కువ రావు. అందుకే శ్రీముఖి షోలు తగ్గించి సినిమాల పై పడింది.

ఒకవేళ యాంకరింగ్ అయితే, గంటలు గంటలు అరవాలి, పైగా ఆ లక్ష రూపాయిలు రోజూ వస్తాయి అనుకుంటే డౌటే. యాంకర్ గా మహా అయితే ఇరవైరోజులు బిజీగా ఉంటుంది. అన్నిటికి మించి శ్రమదోపిడి. అదే సినిమా అయితే, రోజులతో సంబంధం లేదు. పని కూడా తక్కువ. అందుకే ఇక నుండి యాంకరింగ్ చేయను అని టీవీ మేకర్స్ కి ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చిందట. మరి సినిమాల్లో సక్సెస్ అవుతుందా అంటే డౌటే.