Good Bad Ugly Collection: తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్(Thala Ajith Kumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెండు నెలల క్రితమే అజిత్ నుండి విడుదలైన ‘విడాముయార్చి’ చిత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ఆయన కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు బలంగా కోరుకున్నారు కానీ, ఇంత తొందరగా కం బ్యాక్ ఇస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. విడుదలై 9 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 203 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నిన్న గుడ్ ఫ్రైడే కావడంతో ఈ చిత్రానికి 6 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నిన్న కొన్ని కొత్త సినిమాలు విడుదలయ్యాయి, కానీ ఈ చిత్రం పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.
Also Read: 5 సార్లు రీ రిలీజ్ అయిన ‘ఒక్కడు’..ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ ఎంతంటే!
ప్రాంతాల వారీగా ఈ సినిమాకు ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయి అనేది వివరంగా చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తమిళనాడు లో 9 రోజుల్లో 123 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నేడు, రేపు వీకెండ్ కావడంతో ఈ రెండు రోజుల్లో 20 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. తమిళనాడు ప్రాంతంలో ఈ చిత్రం ఇప్పుడు 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు కేవలం విజయ్ మాత్రమే రెండు సార్లు 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాడు. ఇప్పుడు అజిత్ ఆ మార్కుని అందుకుంటే, రెండవ హీరో గా చరిత్ర సృష్టిస్తాడు. లేకపోతే ఆగష్టు లో విడుదల అవ్వబోయే రజినీకాంత్ కూలీ ఆ మార్కుని అందుకుంటుంది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకి సంబంధించిన వసూళ్లు పూర్తి ఆగిపోనట్టు అనిపిస్తుంది.
మూడు రోజుల నుండి గ్రాస్ వసూళ్లు 56 కోట్ల రూపాయిల నుండి కదలడం లేదు. ఈ వీకెండ్ లో కాస్త డీసెంట్ స్థాయి వసూళ్లు ఓవర్సీస్ నుండి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కర్ణాటక లో 13 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల 55 లక్షలు, కేరళ నుండి 3 కోట్ల 25 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 15 లక్షలు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 203 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 99 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకో 17 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. రేపు, ఎల్లుండి లోపు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: అంతరిక్షం లోకి రామ్ చరణ్ ‘పెద్ది’..సోషల్ మీడియా ని ఊపేస్తున్న వీడియో!