https://oktelugu.com/

Varun Lavanya Marriage: పెళ్లి తర్వాత ఫస్ట్ టైం వరుణ్ తో లావణ్య.. చిలిపి అల్లరి.. వైరల్ ఫోటోలు

మూడు రోజులు పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి అనంతరం హైదరాబాద్ కన్వెన్షన్ హాల్ లో నవంబర్ 5న రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2023 / 02:24 PM IST

    Varun Lavanya Marriage

    Follow us on

    Varun Lavanya Marriage: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పండగ జరుపుకున్నారు. తమ దీపావళి వేడుకలపై స్పెషల్ ఫోటో షూట్ చేశారు. దీపావళి కాంతుల్లో వెలిగిపోయిన కొత్త జంట ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నవంబర్ 1న లావణ్య మెడలో వరుణ్ తేజ్ తాళి కట్టాడు. ఇటలీ దేశంలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. వధూవరుల కుటుంబ సభ్యులు మాత్రమే పెళ్ళికి హాజరయ్యారు. మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్స్ పాల్గొన్న ఈ పెళ్లి టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది.

    మూడు రోజులు పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి అనంతరం హైదరాబాద్ కన్వెన్షన్ హాల్ లో నవంబర్ 5న రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది. వెంకటేష్, అలీ, నాగ చైతన్యతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. నూతన జంటను ఆశీర్వదించారు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు వైరల్ అయ్యాయి.

    కాగా వివాహం జరిగిన తర్వాత మొదటి పండగ జరుపుకుంటున్నారు కొత్త జంట. దీపావళి వేడుకల్లో వరుణ్, లావణ్య పాల్గొన్నారు. పండగ కోసం సాంప్రదాయ దుస్తులు డిజైన్ చేయించారు. వరుణ్ డార్క్ మెరూన్ కలర్ కుర్చా ధరించారు. ఒక లావణ్య లైట్ మెరూన్ చోళీ లెహంగా వేసుకున్నారు. చూడముచ్చటగా ఉన్న జంట ఫోటో షూట్ చేశారు. నవ దంపతుల దీపావళి ఫోటో షూట్ సోషల్ మీడియాను ఆకర్షించింది. దీంతో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లవ్లీ కపుల్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు.

    2017లో లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ ల ప్రేమకు బీజం పడింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన మిస్టర్ మూవీలో వీరు జంటగా నటించారు. ఈ చిత్ర షూటింగ్ ఇటలీలో జరిగింది. మిస్టర్ మూవీ సెట్స్ లో మొదలైన పరిచయం ప్రేమకు దారి తీసింది. అనంతరం అంతరిక్షం మూవీలో మరోసారి జతకట్టారు. వీరి ప్రేమ బంధం ఏళ్ల తరబడి సాగింది. రెండేళ్ల క్రితం వరుణ్, లావణ్య ప్రేమించుకుంటున్నారంటూ పుకార్లు వినిపించాయి. షాక్ ఇస్తూ జూన్ 9న నిశ్చితార్థం జరుపుకున్నారు.