https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ సినిమాకు కూడా రెండు రిలీజ్ డేట్లు !

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా నుంచి కోలుకున్నారు. అయితే, ఆయన మోకాలకు సంబంధించి చిన్న సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఆ తరువాత దర్శకుడు త్రివిక్రమ్‌ తో మహేశ్ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే మార్చి 2వ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి టీమ్ అంతా సిద్ధంగా ఉండాలని మహేశ్‌కి త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 26, 2022 / 02:28 PM IST
    Follow us on

    Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా నుంచి కోలుకున్నారు. అయితే, ఆయన మోకాలకు సంబంధించి చిన్న సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఆ తరువాత దర్శకుడు త్రివిక్రమ్‌ తో మహేశ్ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే మార్చి 2వ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి టీమ్ అంతా సిద్ధంగా ఉండాలని మహేశ్‌కి త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చారు.

    Mahesh Babu

    అలాగే ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా త్రివిక్రమ్ చిన్న హింట్ ఇచ్చారు. దసరాకి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ దసరాకి రిలీజ్ కాకపోతే.. 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తారట. మొత్తానికి ఈ సినిమాకు కూడా రెండు రిలీజ్ డేట్లు ఉన్నాయి అన్నమాట. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ సమ్మర్ లో ఉంటుందని టాక్ ఉంది.

    Also Read: రకుల్ పబ్లిక్ గా అడిగేసింది.. మేకర్స్ స్పందన ఏమిటి ?

    కాగా ఈ సినిమా సమ్మర్ లో వస్తే.. మహేష్ బాబు – త్రివిక్రమ్’ సినిమా దసరాలో వస్తోంది. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు ఓ కీలక పాత్రను పోషించనున్నాడని.. మహేష్ కు మామయ్యగా మోహన్ బాబు పాత్రను త్రివిక్రమ్ డిజైన్ చేశాడని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేయనుండటంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.

    Mahesh Babu

    అన్నట్టు ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అలాగే త్వరలోనే ఈ సినిమాలో నటించే మరో హీరోయిన్ ను కూడా అధికారికంగా రివీల్ చేయబోతున్నారు. పైగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తుండటం విశేషం.

    Also Read: ఎన్టీఆర్ సినిమాకు అతను ఫిక్స్.. కారణం ఎన్టీఆరే !

    Tags