https://oktelugu.com/

Puneeth Rajkumar: ‘పునీత్ రాజ్‌ కుమార్’ చివరి చిత్రం పై భారీ అంచనాలు

Puneeth Rajkumar: కన్నడ సూపర్‌ స్టార్, దివంగత పునీత్ రాజ్‌ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆయన నటించిన చివరి చిత్రం కావడంతో ఫ్యాన్స్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 6న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.   కాగా ఈ వేడుకకు చిరంజీవి, ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 26, 2022 / 02:46 PM IST
    Follow us on

    Puneeth Rajkumar: కన్నడ సూపర్‌ స్టార్, దివంగత పునీత్ రాజ్‌ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆయన నటించిన చివరి చిత్రం కావడంతో ఫ్యాన్స్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 6న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.

    Puneeth Rajkumar

     

    కాగా ఈ వేడుకకు చిరంజీవి, ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. మొత్తానికి ఈ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. పునీత్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. పైగా ఈ సినిమా తో అన్నీ రికార్డ్స్ బ్రేక్ అయ్యేలా పునీత్ ఫ్యాన్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

    Also Read: నైజాంలో ‘భీమ్లా నాయక్’ సరికొత్త రికార్డ్.. సంతోషంలో థమన్ డ్యాన్స్ !

    ముఖ్యంగా తమ దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. కాగా ‘జేమ్స్’ నుంచి విడుదలైన ఈ సినిమా టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. పునీత్ ఎప్పటికీ కింగ్. బిగ్ స్క్రీన్‌ పై అప్పు సార్‌ ను చూసేందుకు వెయిటింగ్. చిత్ర యూనిట్‌ కు ఆల్ ది బెస్ట్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    Puneeth Rajkumar

    ఇక పునీత్ రాజ్‌ కుమార్‌ పై నెటిజన్లు ప్రశంసలు కురిపించినట్లుగానే మిగిలిన హీరోలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాన్స్ అయితే.. ఇప్పటి నుంచే పునీత్ చిత్ర పటాలను రెడీ చేస్తున్నారు. ఇక పునీత్ పేరట ఓ గుడిని కూడా కట్టబోతున్నారని తెలుస్తోంది.

    Also Read:  ఆయన ట్రాక్ రికార్డ్  ఎన్టీఆర్, ఏఎన్నార్ లకి కూడా లేదు ! 

    Tags