https://oktelugu.com/

Rajasekhar: ఆ సమయంలో నా జీవితం అయిపోయిందనుకున్నా – రాజశేఖర్

Rajasekhar: యాంగ్రీ మ్యాన్ ‘రాజశేఖర్’ ప్రస్తుతం నటిస్తున్న మూవీ… శేఖర్. ఈ సినిమా ఒక థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్టయిన ఒక క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా ఈ ‘శేఖర్’ మూవీ రాబోతుంది. అయితే, ఈ సినిమా గురించి రాజశేఖర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. పది సినిమాల కష్టం ఒక్క ‘శేఖర్‌’కు అనుభవించానని హీరో రాజశేఖర్ ఎంతో ఎమోషనల్ అవుతూ అన్నాడు. రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘కరోనా సోకిన సమయంలో నా […]

Written By:
  • Shiva
  • , Updated On : February 5, 2022 / 02:07 PM IST
    Follow us on

    Rajasekhar: యాంగ్రీ మ్యాన్ ‘రాజశేఖర్’ ప్రస్తుతం నటిస్తున్న మూవీ… శేఖర్. ఈ సినిమా ఒక థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్టయిన ఒక క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా ఈ ‘శేఖర్’ మూవీ రాబోతుంది. అయితే, ఈ సినిమా గురించి రాజశేఖర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. పది సినిమాల కష్టం ఒక్క ‘శేఖర్‌’కు అనుభవించానని హీరో రాజశేఖర్ ఎంతో ఎమోషనల్ అవుతూ అన్నాడు.

    Dr Rajasekhar

    రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘కరోనా సోకిన సమయంలో నా జీవితం అయిపోయిందనుకున్నా. నేను ఇక సినిమా చేస్తానా ? లేదా ? అనుకున్నాను. ఐతే, కోలుకున్నాక శేఖర్ మూవీ పూర్తి చేశాను. మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు మీ ముందు ఉన్నాను’ అని రాజశేఖర్ తెలిపాడు. ఈ సినిమాను ఎంతో కష్టపడి, ఇష్టంగా చేశామని డైరెక్టర్ జీవిత కూడా చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాలోని ఓ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

    Also Read: హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో జాబ్స్.. నెలకు రూ.లక్ష వేతనంతో?

    ఇక ఈ సినిమాలో అను సితార, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏది ఏమైనా నా జీవితం అయిపోయిందనుకున్నాను అంటూ రాజశేఖర్ మాట్లాడటం అందర్నీ కదిలించింది. అయినా ‘రాజశేఖర్’ యాంగ్రీ మ్యాన్ గా ఉన్న రోజుల్లో సమయానికి షూటింగ్ కి వచ్చేవాడు కాదు, అలాగే సినిమా ప్రమోషన్స్ లో కూడా అసలు కనిపించేవాడు కాదు. ఇక రాజశేఖర్ డేట్లు కూడా ఎప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయో అని తెలుసుకోవడం కూడా అప్పట్లో గగనం అయిపోయేది.

    Rajasekhar

    మొత్తానికి అప్పట్లో రాజశేఖర్ నిర్మాతలకు చుక్కలు చూపించేవాడు. అయితే, కాలం మారింది. కుర్ర హీరోలు ఎక్కువైపోయారు. రాజశేఖర్ లాంటి హీరోలకు డిమాండ్ పూర్తిగా పడి పోయింది. దాంతో జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి హీరోలు కూడా సైలెంట్ గా సైడ్ క్యారెక్టర్స్ కోసం తాపత్రయ పడుతూ.. ఆ క్యారెక్టర్స్ ను మరొకరికి దక్కనీయకుండా దూసుకుపోతున్నారు.

    ఇలాంటి స్థితిలో కూడా రాజశేఖర్ హీరోగానే సినిమాలు చేయడానికి కిందామీదా పడుతూ సొంతంగా డబ్బులు పెట్టి సినిమాలు చేసి.. ఇలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు. దీనికితోడు రాజశేఖర్ కోసం కథలు రాసేవాళ్ళు కూడా ఎవరు లేరు. దాంతో రీమేక్ ల మీద పడ్డాడు ఈ సీనియర్ హీరో. ఇప్పటికే రాజశేఖర్ చాలా రీమేక్ లు చేశాడు. చాలా గ్యాప్ తర్వాత శేఖర్ తో మరో రీమేక్ చేస్తున్నాడు.

    Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

    Tags