Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా ‘ది వారియర్’ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాతో.. రామ్ మరోసారి తన యాక్షన్ సత్తా చూపెట్టడానికి భారీ ఎత్తున సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా ఐదు భారీ సెట్లలను ఈ సినిమా కోసం తీర్చిదిద్దారు. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ను ఈ సెట్స్ లో షూట్ చేస్తున్నారట.
రామ్ కెరీర్ లోనే భారీ స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయట. పైగా ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామ్ సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. కండల తిగిరిన బాడీని రామ్ గతంలో చూపించలేదు. మొదటిసారి ఈ సినిమా కోసం భారీ స్థాయిలో చూపించడానికి తెగ కష్టపడుతున్నాడు. అందుకే.. ఈ మధ్య ఎక్కువ సమయాన్ని రామ్ జిమ్ లోనే గడిపేస్తున్నాడు. రిస్క్ తో కూడుకున్న వర్కౌట్స్ చేస్తున్నాడు. అలాగే కొత్త రకం పరికరాలు తెప్పించి మరీ కష్టపడుతున్నాడు.
Also Read: టాటాల ‘స్వదేశీ’ మర్యాద.. అంతా ‘ఫిదా’
నిజానికి ఈ భారీ వర్కౌట్స్ చేస్తూనే.. రామ్ గతంలో గాయాలపాలయ్యాడు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న క్రమంలోనే రామ్ మెడకు భారీ గాయమైంది. అయినా రామ్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వాస్తవానికి రామ్ కి రావాల్సిన స్థాయిలో స్టార్ డమ్ రాలేదు. తన కంటే వెనుక వచ్చిన హీరోలు విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలకు కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. కానీ రామ్ కి మాత్రం ఎప్పుడూ ఒక్కటే గుర్తింపు.
అందుకే.. రూట్ మార్చాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే లింగుస్వామి దర్శకత్వంలో చేస్తోన్న పాన్ ఇండియా సినిమా కోసం మొదటి నుంచి బాగా కష్టపడుతున్నాడు. పైగా కెరీర్ లో మొదటిసారి చేస్తోన్న పాన్ ఇండియా సినిమా ఇది. అలాగే తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం పూర్తి స్థాయిలో కష్టపడుతున్న సినిమా ఇది. మరి కనీసం ఈ సినిమా అయినా రామ్ కి మంచి గుర్తింపును, గొప్ప స్టార్ డమ్ ను ఇస్తుందా ? చూడాలి.
కాగా దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి నాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే.. బోయపాటి తో సినిమాని సెట్ చేసే పనిలో ఉన్నాడు రామ్,
Also Read: పంజాబ్ లో సీఎం మేనల్లుడి అరెస్టుః ఏం జరుగుతోంది?