Lata Mangeshkar: భారతీయ గాన కోకిల లతా మంగేష్కర్ ఇక లేరు. కరోనా బారిన పడిన ఆమె నేడు తుది శ్వాస విడిచి అశేష అభిమానులను కన్నీళ్ల లోకంలోకి నెట్టేశారు. తన 13 సంవత్సరాల వయస్సులో గాయనిగా కెరీర్ ను మొదలు పెట్టిన ఆమె 1942లో తన మొదటి పాటను రికార్డ్ చేశారు. ఆ రోజు నుంచి ఏడు దశాబ్దాల పాటు తన గాత్రంతో అలరించారు.

తన కెరీర్‌లో ఆమె వివిధ భాషలలో మొత్తం 30,000 పాటలు పాడారు. అయితే, లతా మంగేష్కర్ కి కరోనా పాజిటివ్ అని తెలిసిన దగ్గర నుంచీ ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఆందోళన పడుతూ వచ్చారు. వారి ఆందోళన నిజమైంది. వయస్సు పైబడిన వారి పై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతుంది. లతా మంగేష్కర్ గారి వయసు 92 ఏళ్లు. అందుకే, ఆమె కోలుకోలేక పోయారు.
Also Read: హాట్ ఫోజులతో రెచ్చిపోయిన మీరా జాస్మిన్ !
ఆమె ఇక లేరు అని తెలిసి ఆమె ఫ్యాన్స్ కుమిలిపోతున్నారు. నిజానికి ఈ లెజెండరీ సింగర్ పరిస్థితి విషమించినట్లు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యుడు ప్రతీత్ సందానీ నిన్నే వెల్లడించారు. రెండు రోజుల నుంచి ఆమెకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇక లతా మంగేష్కర్ కోలుకోవడం కష్టం అన్నట్టు ఆయన నిన్నే హింట్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఫ్యాన్స్ కూడా ఈ చేదు వార్త కోసం బాధగా ఎదురుచూశారు. ఇక ఆమె అంత్యక్రియలు నేడు ముంబైలో జరగనున్నాయి.

మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున భారతీయ గాన కోకిల లతా మంగేష్కర్ గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read: పిచ్చి పట్టిందా’ అంటూ రాహుల్ రామకృష్ణ పై నెటిజన్లు సీరియస్ !
[…] Bharadwaj: సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న మూవీ ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సినిమా గురించి అనసూయ మాట్లాడుతూ.. ‘నిజాయతీగా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. కెమెరాకి ప్రతిభ కావాలని నిరూపిస్తూ వస్తున్న ఎంతోమంది ప్రతిభావంతులు ఇందులో నటించారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన కనకం పాత్రని చేశా’ అని చెప్పింది. […]