Kalyan Dev: మెగా డాటర్ శ్రీజను పెళ్లి చేసుకుని, ఆమెతో కలిసి ఒక పాపకు కూడా జన్మను ఇచ్చి.. ప్రసుతం ఆమెకు దూరంగా ఉంటున్నాడు శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవ్. ఇప్పటికే శ్రీజ – కళ్యాణ్ దేవ్ విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాకపోతే, ఇంతవరకు వీళ్లిద్దరూ అధికారికంగా ఈ వార్త పై స్పందించలేదు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది అటు మెగా ఫ్యామిలీ కూడా క్లారిటీ ఇవ్వలేదు.

కానీ, మెగా డాటర్ శ్రీజ తన పేరు నుంచి కళ్యాణ్ దేవ్ పేరును తొలగించి.. అప్పటి నుంచి సోలో లైఫ్ కి సంబంధించి ఎమోషనల్ పోస్ట్ లు పోస్ట్ చేస్తూ ముందుకు సాగుతుంది. పైగా కళ్యాణ్ దేవ్ ను ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది. భర్తను ఫాలో కావడం లేదు అంటేనే.. వీరి మధ్య వ్యవహారం ఎంతవరకు వచ్చింది అనేది అర్ధం అవుతుంది.
Also Read: పక్కా క్లాసిక్ మాస్ లుక్ తో ఐయామ్ బ్యాక్ అంటున్న మెగాస్టార్ !
కాగా సోషల్ మీడియాలో అయితే, వీరి బంధం పై అనేక వార్తలు వస్తున్నాయి. ఎన్ని వార్తలు వచ్చినా ఎవ్వరూ ఖండించడం లేదు. కాబట్టి.. మ్యాటర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐతే, ఈ మధ్యలో శ్రీజ చాలా రకాలుగా మెసేజ్ లు చేసింది. కానీ, గత ఐదు వారాల నుంచి కళ్యాణ్ దేవ్ మాత్రం ఈ విషయంలో చాలా సైలెంట్ గా ఉంటూ వస్తున్నాడు.
View this post on Instagram
అసలు సోషల్ మీడియాలో ఇంతవరకు ఎటువంటి పోస్టులు పోస్ట్ చేయలేదు. తన సినిమా ‘సూపర్ మచ్చి’ సంక్రాంతికి రిలీజ్ అయింది. అప్పుడు కూడా ఆ సినిమా గురించి కళ్యాణ్ దేవ్ ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం విశేషం. ఐతే, ఆరు వారాల తర్వాత ఇప్పుడు మళ్ళీ వరుసగా ఇంస్టాగ్రామ్ లో కళ్యాణ్ దేవ్ పోస్ట్ లు పెడుతూ, తన సోలో ఫోటోలు పెడుతూ వస్తున్నాడు.
కాగా ఈ క్రమంలో కళ్యాణ్ దేవ్ ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. ‘నువ్వు ఇది చెయ్యలేవు అని అంటే పట్టించుకోకు. నీ పని నువ్వు చెయ్యి’ అని కొటేషన్ కూడా పెట్టాడు. ఈ మెసేజ్ ను బట్టి.. కళ్యాణ్ దేవ్ ఎంతగా ఆలోచిన్నాడో అర్ధం అవుతుంది. అన్నట్టు కళ్యాణ్ దేవ్ నటించిన ‘కిన్నెరసాని’ అనే మరో సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది.
[…] Ram Charan: ”పుష్ప” సినిమాతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం రష్మిక పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ”పుష్ప” సినిమా నేషనల్ వైడ్‌గా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో రష్మిక రేంజ్ బాలీవుడ్ వరకు చేరింది. అయితే తాజాగా రష్మిక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. చెర్రీ కొత్త సినిమాలో రష్మికను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. […]