Aswagandha: మనలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధ పడుతూ ఉంటారు. అయితే అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్లు అశ్వగంధ సహాయంతో సులభంగా బరువు తగ్గవచ్చు. అశ్వగంధను భారతీయ జిన్ సెంగ్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. అశ్వగంధను వాడటం వల్ల బరువుతో పాటు ఒత్తిడిని కూడా తగ్గించుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అశ్వగంధ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
అశ్వగంధతో తయారు చేసిన టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మతిమరపు సమస్యతో బాధపడే వాళ్లు అశ్వగంధను వినియోగిస్తే మంచిది. అశ్వగంధను వాడటం వల్ల నిద్రలేమి సమస్యకు కూడా సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. పురుషుల్లో టెస్టోస్టోరాన్ హార్మోన్ ను పెంచడంలో అశ్వగంధ తోడ్పడుతుందని చెప్పవచ్చు. అశ్వగంధ పురుషులలో శుక్రకణాలను పెంచడానికి సహాయపడుతుంది.
సంతాన లేమి సమస్యతో బాధ పడేవాళ్లు అశ్వగంధతో చేసిన ఆహారం తీసుకుంటే మంచిదని చెప్పవచ్ఛు. మధుమేహ సమస్యలను నిరోధించడంలో అశ్వగంధ ఎంతగానో ఉపయోగపడుతుంది. నెలసరి సమస్యలు, పీసీఓడీతో బాధపడేవాళ్లు అశ్వగంధను వాడటం ద్వారా సమస్యను సులభంగా దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మెనోపాజ్ సమస్యలకు చెక్ పెట్టడంలో అశ్వగంధ ఉపయోగపడుతుంది.
తరచూ ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధ పడేవాళ్లు అశ్వగంధను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా సమస్యలను అధిగమించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అశ్వగంధను వాడటం వల్ల ఆకలి తగ్గి శరీర బరువు అదుపులో ఉంటుంది.