https://oktelugu.com/

Pushpa: స్పైడర్‌ మ్యాన్‌, సూర్యవంశీని దాటేసిన ‘పుష్ప’ !

Pushpa: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన సినిమా ‘పుష్ప- ది రైజ్’. నిజానికి మొదటి రోజు నుంచీ ‘పుష్ప’ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా ఆ తర్వాత బాగా పుంజుకుంది. కాగా బాక్సాఫీసు వద్ద పుష్ప సినిమా 50 రోజుల్లో వరల్డ్ వైడ్‌ గా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టింది. ఏకంగా రూ.365 కోట్లు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 5, 2022 / 10:55 AM IST
    Follow us on

    Pushpa: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన సినిమా ‘పుష్ప- ది రైజ్’. నిజానికి మొదటి రోజు నుంచీ ‘పుష్ప’ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా ఆ తర్వాత బాగా పుంజుకుంది. కాగా బాక్సాఫీసు వద్ద పుష్ప సినిమా 50 రోజుల్లో వరల్డ్ వైడ్‌ గా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టింది.

    Pushpa

    ఏకంగా రూ.365 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. కాగా నేడు పుష్ప హిందీలో అధికారికంగా రూ. 100 కోట్ల మార్కుని దాటింది. 2020-21 భారత్‌లో విడుదలైన చిత్రాల్లో తానాజీ (320 కోట్లు), తర్వాత స్పైడర్‌ మ్యాన్‌ నోవే హోం (249 కోట్లు), సూర్యవంశీ (227 కోట్లు)లను దాటి పుష్ప (304 కోట్లు)తో 2వ స్థానంలో నిలిచింది.

    Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు !

    తెలుగులోనూ రాజమౌళికి తగ్గట్టు ఢీ అంటే ఢీ అన్నాడు బన్నీ. బాహుబలి మొదటి రెండు స్థానాల్లో ఉంటే, సాహో 3లో ఉండగా, పుష్ప, ‘అల..’ చిత్రాలతో 4,5 స్థానాల్లో నిలిచాడు. పుష్ప నయా రికార్డ్‌: స్పైడర్‌మ్యాన్‌, సూర్యవంశీని దాటేసింది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆయన కెరీర్ లోనే భారీ విజయం సాధించింది.

    Pushpa

    ఇక ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌ గా సందడి చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ మూవీ పార్ట్-2 కూడా రాబోతోంది.

    Also Read: రోజా రాజీనామాకు రెడీయేనా?

    Tags