Latest OTT Releases This Weekend: ప్రతీ వారం ఓటీటీ లలో వచ్చే సరికొత్త కంటెంట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఈ వారం కూడా బోలెడన్ని కొత్త సినిమాలు మీ ముందుకు వచ్చేశాయి. ఈ సినిమాలన్నీ థియేటర్స్ లో చూడదగినవి. మూవీ లవర్స్ ఎలాగో థియేటర్స్ కి వెళ్లి కచ్చితంగా చూస్తారు. కానీ థియేటర్స్ కి వెళ్లే ఓపిక లేక ఇంట్లోనే కూర్చొని ఓటీటీ లో చూడాలని కోరుకునేవారికి ఈ వీకెండ్ పండగే. ఏకంగా 12 సినిమాలు వచ్చేశాయి , వాటిల్లో మంచి రేటింగ్స్ ని సంపాదించుకున్న 4 సినిమాలు , ఒక వెబ్ సిరీస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.
మృత్యుంజయ్(Mrityunjay Movie) :
శ్రీవిష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన ఈ లేటెస్ట్ చిత్రం క్రిటిక్స్ నుండి పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ పరంగా కూడా ఈ చిత్రం యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీవిష్ణు, చాలా కాలం తర్వాత ఇలాంటి సీరియస్ సబ్జెక్టు తో మన ముందుకు రావడం సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది.
సితారే జమీన్ పర్(Sitaare Zameen Parr) :
‘తారే జమీన్ పర్’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా అమీర్ ఖాన్(Aamir Khan) దర్శకత్వం లోనే తెరకెక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సాధారణంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఓటీటీ లోకి మాత్రం అమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని అన్ని సినిమాలు లాగా నాలుగు వారాలకే ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అందుకే ఇన్ని రోజుల సమయం పట్టింది. ఈ చిత్రాన్ని సోనీ లివ్ యాప్ లో చూడొచ్చు.
హే బల్వంత్(Hey Balwanth) :
ఫిబ్రవరి నెలలో విడుదలైన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి ఇది. సుహాస్(Actor Suhas), శివాని నాగారం(Shivani Nagaram) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం లో నరేష్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ నెల 31 నుండి ఈ చిత్రం జీ 5 యాప్ లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని చూడొచ్చు.
సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసని :
శివాజీ , లయ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం రీసెంట్ గానే థియేటర్స్ లో విడుదలై మిశ్రమ ఫలితాన్ని సంపాదించుకుంది. కానీ టైం పాస్ కోసం ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈటీవీ విన్ యాప్ తో పాటు నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.
కాట్టన్:
తమిళ స్టార్ హీరోలలో ఒకసారైనా విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ రీసెంట్ గానే జియో హాట్ స్టార్ లో విడుదలైంది. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.
