Devara And OG: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ఎన్టీఆర్(Junior NTR) కెరీర్స్ లో మైలు రాయి లాంటి చిత్రాలు ‘దేవర'(Devara Movie), ‘ఓజీ'(They Call Him OG). ఈ రెండు సినిమాలకు విడుదలకు ముందు క్రేజ్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు. అలా భారీ అంచనాల నడుమ విడుదల ఈ రెండు చిత్రాలు కలెక్షన్స్ పరంగా అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచాయి. ముఖ్యంగా ఓపెనింగ్స్ అయితే వేరే లెవెల్. రెండు సినిమాలు కూడా మొదటి రోజు 150 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు రాబట్టాయి. లాంగ్ రన్ లో ‘దేవర’ కి పాన్ ఇండియా అడ్వాంటేజ్ ఉండడం తో, ఆ చిత్రానికి ‘ఓజీ’ మీద ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఓజీ చిత్రానికి 320 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ‘దేవర’ చిత్రానికి 396 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఓటీటీ లో కూడా ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ‘దేవర’ చిత్రానికి 15 మిలియన్ వ్యూస్ రాగా, ‘ఓజీ’ చిత్రానికి ఇప్పటి వరకు 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ‘దేవర’ ని కూడా దాటొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ రెండు సినిమాలు ఇప్పటి వరకు టీవీ టెలికాస్ట్ అవ్వలేదు. ‘ఓజీ’ చిత్రం విడుదలై 5 నెలలు పూర్తి అయ్యింది , అదే విధంగా ‘దేవర’ చిత్రం విడుదలై ఏడాదిన్నర కావొస్తుంది. మిగిలిన సినిమాలు థియేటర్స్ లో విడుదలైన అతి తక్కువ సమయం లోనే టీవీ లో టెలికాస్ట్ అవుతున్నాయి. కానీ ఈ రెండు సినిమాలు ఎందుకు నెలలు గడుస్తున్నా కూడా టీవీ లో టెలికాస్ట్ అవ్వడం లేదు అనేది ప్రతీ ఒక్కరిలో మెలుగుతున్న ప్రశ్న. అందుకు ముఖ్య కారణం ఈ రెండు సినిమాల సాటిలైట్ రైట్స్ ని మేకర్స్ ఇప్పటి వరకు ఎవరికీ అమ్మలేదు.
‘దేవర’ చిత్రానికి నిర్మాత కళ్యాణ్ రామ్ సాటిలైట్ రైట్స్ కోసం 60 కోట్ల రూపాయిల రేంజ్ లో డిమాండ్ చేస్తున్నాడు. అది కూడా కేవలం మూడేళ్లకు మాత్రమే. అందుకు ఏ టీవీ ఛానల్ కూడా ఒప్పుకోలేదు. అందుకే ఈ సినిమా ఇప్పటి వరకు టెలికాస్ట్ అవ్వలేదు. ‘ఓజీ’ పరిస్థితి కూడా ఇదే, సన్ నెట్ వర్క్స్ సంస్థ ఈ చిత్రాన్ని 30 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి రెడీ గా ఉంది. కానీ మేకర్స్ ఏకంగా 75 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈమధ్య కాలం లో టీవీ లో టెలికాస్ట్ అవుతున్న సినిమాలకు అంత గొప్ప ఆదాయం రావడం లేదు. కారణం ఓటీటీ.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓటీటీ లోనే ఈమధ్య సినిమాలు చూస్తున్నారు. అందుకే మేకర్స్ నిర్మాతలు అదిగినంత డబ్బులు ఇవ్వలేకపోతున్నారు.
