Lara Dutta: దశాబ్దం క్రితం హిందీ సినీ పరిశ్రమలో ఓ ఊపు ఊపి అప్పటి టాప్ బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న నటి లారా దత్తా. ప్రస్తుతం అదే బాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ.. రాణిస్తున్నారు. తాజాగా, ఈ ముద్దుగుమ్మ ఓ డేటింగ్ యాప్‌లో పాల్గొన్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అందులో లారాకు అకౌంట్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు ఆమె ఈ యాప్‌ను యూజ్ చేస్తున్నట్లుగా వచ్చిన మీమ్స్ కూాజా నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఆమె సన్నిహితులు, అభిమానుల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తడంతో… లారానే స్వయంగా వచ్చి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తాను ఏ డేటింగ్ యాప్ ఉపయోగించడం లేదని.. తన ఫొటో ఉన్న ప్రొఫైల్ నకిలీదని స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ వేదికగా డేటింగ్ యాప్ గురించి క్లారిటీ ఇచ్చిన ఈ భామ.. నిన్నటి నుంచి నా పేజ్ మొత్తం మీమ్స్, మెసేజ్‌లతో పూర్తిగా నిండిపోయింది. వారంతా ఓ రకమైన డేటింగ్లో నేను ఉన్నానని చెబుతున్నారు. కానీ, అసలైన నిజం ఏంటంటే.. నేను ఏ డేటింగ్ యాప్‌లో లేను. ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఇలాంటి యాప్‌లను ఉపయోగించలేదు. అలాగని, డేటింగ్ యాప్‌లకు నేను వ్యతిరేకం కాదు. ప్రజలు ఒకరినొకరు కనెక్ట్ చేసుకునేందుకు.. డేటింగ్ యాప్ ఒక అద్భుతమైన ప్లాట్‌ఫామ్ అని తెలిపింది. కానీ, నేను వ్యక్తిగతంగా ప్రస్తుతం డేటింగ్ యాప్‌లో అయితే లేను. అంటూ చెప్పుకొచ్చింది.