Etela Rajender: హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసి గెలుపొందిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నేడు అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో బుధవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హుజరాబాద్‌లో జరిగిన ఉపఎన్నికలో టిఆర్‌ఎస్, బిజెపి మధ్య హౌరాహౌరి పోటీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పోటీలో 23 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో ఈటల రాజేందర్ గెలవడం బిజెపికి గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు ఉండగా ఇప్పుడు మూడవ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ బిజెపి తరఫున అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు అన్నట్టుగా అసెంబ్లీలో త్రిబుల్ ఆర్ సినిమా చూపిస్తానని ప్రచారంలో చెప్పారు.

ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇది ఏడోసారి. ఇప్పటివరకు ఆరు సార్లు ఆయన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. ప్రతిపక్షంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత.. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా రెండుసార్లు పనిచేశారు. 2014 నుంచి అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ సీటింగ్ వైపు కూర్చున్నారు. కానీ.. ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా పరిస్థితి ఉంది.
Also Read: Harish Rao: హరీష్ రావుకు ఈటల వదిలేసిన వైద్యఆరోగ్యశాఖ.. రివార్డా? శిక్షనా?
ఈటల రాజేందర్ ముఖం కూడా అసెంబ్లీలో కన్పించొద్దని పట్టుబట్టి డబ్బులిచ్చి ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్‌కే పట్టంకట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా తర్వాత ఈటల రాజేందర్.. బీజేపీలో చేరారు. అదే పార్టీ నుంచి టికెట్ పై హుజూరాబాద్ బైపోల్ లో గెలిచారు. గత ఆరుసార్లకు భిన్నంగా.. ఏడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రానున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్రమంతటా ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో ఈ ఆసక్తి మరింత పెరగనుంది. బీజేపీ ఎమ్మెల్యేగా తొలిసారిగా అసెంబ్లీకి ఈటల రాజేందర్ రాక, ఆయన ప్రసంగం, చేసే విమర్శలు.. ప్రభుత్వం వివరణలు.. ఇవన్నీ టాక్ ఆఫ్ తెలుగు స్టేట్స్ కానున్నాయి. నేటి ఈటల ప్రమాణస్వీకారాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని రాష్ట్ర బీజేపీ, ఈటల మద్దతుదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Also Read: Revanthreddy:రేవంత్ రెడ్డి ప్లాన్ బెడిసికొట్టిందా..? ప్రయత్నాలు వృథానేనా..?