
దాని ఫలితంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. గట్టి పోటీ మధ్య ఆస్కార్ ని సొంతం చేసుకుంది. ఈ విభాగంలో ఇండియాకు ఆస్కార్ తెచ్చిన మొదటి చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ నిలిచింది. ఆస్కార్ ప్రకటించిన వేళ రాజమౌళి అండ్ టీమ్ తో పాటు ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. నాటు నాటు సాంగ్ కంపోజ్ చేసిన కీరవాణి, సాహిత్యం అందించిన చంద్రబోస్… వేదికపైకి వెళ్లి, ఆస్కార్ చేపట్టారు.
కీరవాణి తన ఆనందాన్ని షార్ట్ అండ్ స్వీట్ గా ముగించాడు. ప్రతి భారతీయుడు గొప్పగా ఫీలయ్యే క్షణంగా వర్ణించారు. అయితే ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ ప్రకటించిన క్షణంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ తో పోటీ పడిన అమెరికన్ సింగర్ లేడీ గాగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. నిజానికి మనకు అవార్డు రాకపోతే ఒకింత నిరాశ కలుగుతుంది. గెలిచిన వాళ్ళను చూసి ప్రశంసించాలనే మర్యాద పాటించినప్పటికీ మనసులో ఓ మూలాన బాధ ఉంటుంది.
లేడీ గాగా అందుకు భిన్నంగా స్పందించారు. ఆర్ ఆర్ ఆర్ కి అవార్డు రావడం తనకు వచ్చినంతగా ఆమె ఫీల్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ పేరు ప్రకటించగానే… లేచి నిల్చొని పెద్దగా చప్పట్లు కొడుతూ, నవ్వారు. లేడీ గాగా సెలబ్రేటింగ్ మూమెంట్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. టాప్ గన్ మూవీ నుండి ఆమె కంపోజ్ చేసి పాడిన హోల్డ్ మై హ్యాండ్ సాంగ్ నామినేషన్స్ లో ఉంది. తమ చిత్రానికి కాకుండా ఆర్ ఆర్ ఆర్ కి అవార్డు దక్కింది. నాటు నాటు సాంగ్ ని ఆమె ఎంతగా ఇష్టపడ్డారో తెలియదు కానీ… మన విజయాన్ని ఆమె జరుపుకున్నారు.
lady gaga’s reaction when natu natu winning best original song at the #oscars is so pure pic.twitter.com/J1bsmNCJlQ
— Gaga Crave 🌷 (@AMENARTPOP) March 13, 2023