Laapataa Ladies: ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కేవలం ఒక నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి ఎన్నో అద్భుతమైన సినిమాలను అంధించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘లాపట్టా లేడీస్’ అనే చిత్రానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఈ సినిమాకి అమీర్ ఖాన్ తో పాటుగా, ఆయన మాజీ భార్య కిరణ్ రావు సహా నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, దర్శకత్వం కూడా వహించింది. కొత్త నటీనటులతో తీసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కమర్సియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. కేవలం నాలుగు కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం పాతిక కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. థియేట్రికల్ రిలీజ్ కంటే, ఓటీటీ లో ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాలలో ఒకటిగా నిల్చింది.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రం 2025 సంవత్సరం కి గాను ఆస్కార్ అవార్డ్స్ కి ఎంపిక కాపాడిన చిత్రం గా నిల్చింది. ఈ విషయాన్నీ నేషనల్ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాను భార్వ కాసేపటి క్రితమే మీడియాకు అధికారిక ప్రకటన చేసింది. 13 మంది సభ్యులతో కూడిన ఈ జ్యురీ 12 హిందీ, 6 తమిళ్, 4 మలయాళం సినిమాల నుండి ఎంచుకున్నారు. మన తెలుగు నుండి ఒక్క సినిమా కూడా జ్యురీ కి వెళ్ళకపోవడం గమనార్హం. #RRR చిత్రం తో ఆస్కార్ అవార్డు పొందిన ఇండస్ట్రీ నుండి ఒక్క సినిమా కూడా 2025 వ సంవత్సరం కి ఆస్కార్ అవార్డ్స్ ఎంపిక కోసం జ్యురీ కి మనోళ్లు పంపలేదా?, ఒకవేళ పంపినా కూడా తెలుగు సినిమాని తొక్కే ప్రయత్నం చేస్తున్నారా?..అన్ని ఇండస్ట్రీస్ నుండి తమ సినిమాలను ఆస్కార్ అవార్డ్స్ కి పంపే ప్రక్రియ కోసం కృషి చేయగా, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఒక్క సినిమా కూడా వెళ్ళకపోవడం అవమానకరం.
ఏ ఇండస్ట్రీ కి సాధ్యం కానటువంటి ఆస్కార్ అవార్డు మన ఇండస్ట్రీ కి వచ్చిందనే అసూయ తో కావాలని ఇలాంటి కుట్రపూరితంగా చర్యలు చేపట్టారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి వినిపిస్తున్న వార్త. ఇక ‘లాపట్టా లేడీస్’ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని డైరెక్టర్ కిరణ్ రావు అద్భుతమైన కామెడీ తో పాటు, ఎమోషన్స్ ని కూడా సమతూల్యంలో జోడించి తెరకెక్కించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే పెళ్ళికి సిద్దమైన రెండు జంటలు, కొన్ని అనుకోని సంఘటనల ఎదురు అవ్వడం వల్ల, పెళ్లి కొడుకులు ఒకరు చేసుకోవాల్సిన అమ్మాయిని, మరొకరు చేసుకుంటారు. ఆ తర్వాత ఎదురైనా సంఘటనల నేపథ్యంలో స్క్రీన్ ప్లే నడుస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం అందుబాటులో ఉంది, ఎవరైనా ఇప్పటి వరకు ఈ సినిమాని చూడకుంటే వెంటనే చూడండి. ఈ చిత్రం కేవలం హిందీ లో మాత్రమే అందుబాటులో ఉంది, తెలుగు లో లేదు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఈ సినిమాకి సంబంధించిన రీమేక్ రైట్స్ ని కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More