https://oktelugu.com/

L2 : Empuraan : 48 గంటల్లో 120 కోట్లు..చరిత్ర సృష్టించిన మోహన్ లాల్ ‘L2: ఎంపురాన్’

L2 : Empuraan : దేశం లో ఉన్న అన్ని సినీ పరిశ్రమల్లో అతి చిన్న సినీ పరిశ్రమ మాలీవుడ్. ఒకప్పుడు మోహన్ లాల్(Mohanlal), మమ్మూటీ సినిమాలకంటే షకీలా సినిమాలకు ఎక్కువ వసూళ్లు వస్తుండేవి అనేటోళ్లు ట్రేడ్ పండితులు.

Written By: , Updated On : March 29, 2025 / 04:33 PM IST
L2: Empuraan

L2: Empuraan

Follow us on

L2 : Empuraan : దేశం లో ఉన్న అన్ని సినీ పరిశ్రమల్లో అతి చిన్న సినీ పరిశ్రమ మాలీవుడ్. ఒకప్పుడు మోహన్ లాల్(Mohanlal), మమ్మూటీ సినిమాలకంటే షకీలా సినిమాలకు ఎక్కువ వసూళ్లు వస్తుండేవి అనేటోళ్లు ట్రేడ్ పండితులు. కానీ మలయాళం సినీ ఇండస్ట్రీ ఖ్యాతి ని ప్రపంచం నలుమూలల విస్తరింపచేసేలా చేసిన నటులు మోహన్ లాల్, మమ్మూటీ మాత్రమే. మలయాళం లో ఒక సినిమా పెద్ద హిట్ అయ్యి 50 కోట్ల రూపాయిల గ్రాస్ వస్తేనే భారీ వసూళ్లుగా భావిస్తుంటారు అక్కడి ట్రేడ్ పండితులు. అలాంటిది మోహన్ లాల్ 8 ఏళ్ళ క్రితమే మలయాళం ఫిలిం ఇండస్ట్రీ కి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాని అందించాడు. ఇప్పుడు కేవలం రెండు రోజుల్లోనే వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, మా మలయాళం ఫిలిం ఇండస్ట్రీ మిగిలిన ఇండస్ట్రీస్ కి ఏ మాత్రం తీసిపోదు అని నిరూపించి చూపించాడు.

Also Read : ‘L2 : ఎంపురాన్’ మూవీ ట్విట్టర్ టాక్..ఫస్ట్ హాఫ్ ఆ రేంజ్ లో ఉందా!

రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘L2 : ఎంపురాన్'(L2: Empuraan movie) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ సినిమాకు మొదటి రోజు ఓవర్సీస్ లో 50 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రేంజ్ వసూళ్లు హిందీ సినిమాలకు కానీ, తెలుగు సినిమాలకు కానీ ఇది వరకు రాలేదు. కేవలం కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే ఈ రేంజ్ గ్రాస్ ఓవర్సీస్ లో వచ్చాయి. ఇక ఇండియా ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 25 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు 75 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, రెండవ రోజు దాదాపుగా 45 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక మలయాళం సినిమాకి ఈ రేంజ్ గ్రాస్ వస్తుందని మలయాళం సినీ ప్రముఖులు కూడా ఊహించలేదు.

అలా కేవలం రెండు రోజుల్లో 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఫుల్ రన్ లో కచ్చితంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. మలయాళం వెర్షన్ కి భారీ వసూళ్లు వస్తుండగా, ఆ తర్వాత తమిళ వెర్షన్ లో ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. తెలుగు లో మాత్రం ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. ఇక్కడ మొదటి నుండే ఈ చిత్రానికి హైప్ చాలా తక్కువగా ఉంది. నేడు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఒకసారి పరిశీలిస్తే, ఈ చిత్రానికి రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు ఉగాది కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు ఉంటాయి.

Also Read : ఎల్ 2 ఎంపూరన్ ఫుల్ మూవీ రివ్యూ…