L2 Empuraan Movie Review (3)
L2 Empuraan Movie Review: మలయాళ సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాత్మకమైన సినిమాలను చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ లాల్(Mohan Lal)… ఈయన వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ‘ఎల్ 2 ఎంపూరన్’ అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు… ఇంతకుముందు వచ్చిన ‘లూసిఫర్’ (Lucifer) సినిమాకి ఇది సీక్వెల్ గా వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే లూసిఫర్ సినిమా ఎక్కడైతే ముగించారో ఈ సినిమాని అక్కడి నుంచే మొదలుపెట్టారు….గతలో వచ్చినట్టుగానే ఇప్పుడు కూడా కేరళలో ఎలక్షన్స్ వస్తాయి. స్టీఫెన్ గట్టుపల్లి ఏం చేశాడు? ఇతర దేశాల వాళ్ళు ఆయన మీద చేస్తున్న అధ్యయనం ద్వారా వాళ్ళకి తెలిసిన నిజాలు ఏంటి? దాని ద్వారా ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదురుకున్నాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో పృధ్విరాజ్ సుకుమార్ యాక్షన్ ఎపిసోడ్స్ ని భారీగా ఎలివేట్ చేసే విధంగా సినిమాని ముందుకు నడిపించాడు. లూసిఫర్ సినిమాలో కూడా హీరోయిజాన్ని ఎక్కువగా ఎలివేట్ చేసే ప్రయత్నమైతే చేశాడు. ఇక ఈ సినిమాను సైతం అదే మాదిరిగా తెరకెక్కించాడు. కథలో అంతర్లీనంగా ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ను మెయిన్ ట్రాక్ లోకి తీసుకొచ్చి దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు అవి ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా పృథ్విరాజ్ సుకుమారన్ వాటిని తీర్చిదిద్దిన విధానం అద్భుతంగా ఉంది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా వాటిని ఎలివేట్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అయింది. ఈ సీన్ ఇక మోహన్ లాల్ తన ఇంటెన్స్ పర్ఫామెన్స్ ను ఇస్తూ సినిమాను నెక్స్ట్ లెవెల్ కైతే తీసుకెళ్లాడు.
ఇక లూసిఫర్ సినిమా ఇప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని సాధించింది. కానీ ఎల్2 ఎంపూరన్ సినిమా మీద భారీ హైప్ అయితే ఉంది. కాబట్టి ఈ సినిమాకి లూసిఫర్ అంత క్రేజ్ అయితే దక్కకపోవచ్చు. ఎందుకంటే మూవీ సీక్వెల్ గా వచ్చినప్పటికి కథలో పెద్దగా ఏమీ లేకపోవడం వల్ల ఈ సినిమాకి కొంతవరకు అది మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కానీ స్క్రీన్ ప్లే తో మాత్రం పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక మ్యాజిక్ చేశాడనే చెప్పాలి.
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే మోహన్ లాల్ ఎప్పటిలానే ది బెస్ట్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఆయనని కంప్లీట్ యాక్టర్ అని ఎందుకంటారో ఈ సినిమాలో మరోసారి ప్రూవ్ చేశాడు.అటు యాక్షన్ ఎపిసోడ్స్, ఇటు పొలిటిక్స్ సంబంధించిన సన్నివేశాలలో యాక్ట్ చేస్తూనే ఎమోషనల్ సీన్స్ తో కూడా ప్రేక్షకులను కట్టిపడేసే యాక్టింగ్ అయితే చేశాడు…
మంజు వారియర్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించింది. తన పాత్రకి కూడా స్కోప్ ఉండటం తో చాలా బాగా నటించింది. ఇక టావినో థామస్ సినిమా మీద మంచి హైప్ ను తీసుకురావడమే కాకుండా తన నటన ప్రతిభను చూపిస్తూ మరోసారి తను చాలా మంచి నటుడని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు… ఇక పృధ్వీరాజ్ సుకుమారన్ సైతం మరోసారి ఈ సినిమాలో కనిపించి సినిమా మీద హైప్ తీసుకురావడమే కాకుండా తన పాత్ర పరిధి మేరకు దానికి న్యాయమైతే చేశాడు. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరు బాగా నటించి మెప్పించారు…
టెక్నికల్ అంశాలు
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ ఓకే అనిపించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రేక్షకులను కట్టి పడేసింది…ఎమోషనల్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మ్యూజిక్ విషయంలో దీపక్ దేవ్ కొంతవరకు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నమైతే చేశాడు… ఇక సినిమాటోగ్రాఫర్ విషయానికి వస్తే ఈ సినిమాలో వాడిన ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతంగా కుదిరింది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ లో వాడిన ఫ్రేమ్ అలాగే ఎమోషనల్ సీన్స్ కి వాడిన ఫ్రేమ్ ల్లో చిన్నపాటి వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకుడి మూడు ఎక్కడ చెడిపోకుండా విజువల్ గా సినిమాని చాలా బాగా తెరకెక్కించడంలో సినిమాటోగ్రాఫర్ చాలా వరకు హెల్ప్ అయ్యాడు… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
మోహన్ లాల్ యాక్టింగ్
పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్
కథలో పెద్దగా కాన్ఫ్లిక్ట్ లేదు
రేటింగ్
ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.5/5