https://oktelugu.com/

L2 Empuraan Twitter Talk: ‘L2 : ఎంపురాన్’ మూవీ ట్విట్టర్ టాక్..ఫస్ట్ హాఫ్ ఆ రేంజ్ లో ఉందా!

L2 Empuraan Twitter Talk ట్విట్టర్ నుండి వస్తున్న టాక్ ఏమిటంటే ఫస్ట్ హాఫ్ లో మోహన్ లాల్(Mohanlal) దాదాపుగా 50 నిమిషాల పాటు కనిపించడు, సన్నివేశాలు కూడా పెద్దగా గ్రిప్పింగ్ గా లేదు, అంచనాలకు మించి ఉంటుందని ఆశిస్తే ఇలా ఉందేంటి, ఫస్ట్ హాఫ్ మాత్రం యావరేజ్ అంటూ చెప్పుకొచ్చారు.

Written By: , Updated On : March 27, 2025 / 09:45 AM IST
L2 Empuraan Twitter Talk

L2 Empuraan Twitter Talk

Follow us on

L2 Empuraan Twitter Talk: ‘లూసిఫర్’ లాంటి సంచలన చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ‘L2: ఎంపురాన్'(L2 : empuran) చిత్రం నేడు అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. మలయాళం ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మొదటిరోజు 60 కోట్ల రూపాయలకు గ్రాస్ వసూళ్లు రావడం ఒక సెన్సేషన్. ఎందుకంటే ఇప్పటి వరకు మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో ఒక సినిమాకు 15 కోట్ల రూపాయిల ఓపెనింగ్ వస్తేనే ఆల్ టైం రికార్డు అని పిలిచేవాళ్ళు. కానీ ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 60 కోట్లు వచ్చిందంటే, ఏ రేంజ్ మాస్ ర్యాంపేజ్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాకు సోషల్ మీడియా నెటిజెన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము.

ట్విట్టర్ నుండి వస్తున్న టాక్ ఏమిటంటే ఫస్ట్ హాఫ్ లో మోహన్ లాల్(Mohanlal) దాదాపుగా 50 నిమిషాల పాటు కనిపించడు, సన్నివేశాలు కూడా పెద్దగా గ్రిప్పింగ్ గా లేదు, అంచనాలకు మించి ఉంటుందని ఆశిస్తే ఇలా ఉందేంటి, ఫస్ట్ హాఫ్ మాత్రం యావరేజ్ అంటూ చెప్పుకొచ్చారు. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ సెటప్ కి సమయం తీసుకుంది, అందుకే వీక్ గా ఉన్నట్టు అనిపించి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. కానీ సెకండ్ హాఫ్ కి మాత్రం రెస్పాన్స్ అదిరిపోయింది. అభిమానులు, ప్రేక్షకులు థియేట్రికల్ ట్రైలర్ ని చూసి ఈ సినిమా ఎంత గొప్పగా ఉంటుందో అని ఒఊహించుకున్నారో, అంతకు మించి ఉంది. యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయని అంటున్నారు నెటిజెన్స్. డైరెక్టర్ పృథ్వీ రాజ్ సుకుమారన్ ఫస్ట్ హాఫ్ మీద కూడా కాస్త ద్రుష్టి పెట్టి ఉండుంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్లిపోయేదని చూసిన ప్రతీ ఒక్క ప్రేక్షకుడి అభిప్రాయం.

ఇకపోతే తెలుగు వెర్షన్ కి సంబంధించిన రివ్యూస్ మాత్రం ట్విట్టర్ నుండి ఇంకా రాలేదు. తెలుగు ఆడియన్స్ లో ఈ చిత్రం కావాల్సినంత బజ్ ని క్రియేట్ చేయలేకపోయింది. కానీ టాక్ వచ్చింది కాబట్టి కచ్చితంగా సాయంత్రం షోస్ నుండి పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోహన్ లాల్ మరియు మూవీ టీం మొత్తం తెలుగు లో ప్రొమోషన్స్ ఇరగకుమ్మేసారు. దాని ప్రభావం కూడా వీకెండ్ లో మనం చూడొచ్చు. తెలుగు వెర్షన్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ లెవెల్ లో విడుదల చేసాడు. వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న దిల్ రాజు ఈ సినిమాతో ఈమేరకు సక్సెస్ ని రుచి చూస్తాడో చూడాలి.