Lucifer vs Godfather: ఒక భాషలో హిట్టైన సినిమా ఇతర భాషల్లో రీమేక్ కావడం సర్వసాధారణం. రీమేక్స్ లో నటించడం నిజానికి ఒక ఛాలెంజ్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు, ఒరిజినల్ చిత్రంలో నటులు ఎలా చేసినా వారిదే బెస్ట్ అంటారు. రీమేక్ లో నటించిన నటులు అంతకు మించి బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చినా పెదవి విరుస్తారు. అది హ్యూమన్ సైకాలజీ. ఒరిజినల్ ని ఫాలో కాకుండా మన మార్క్ చూపించడం కొంచెం కష్టమైన వ్యవహారం. గాడ్ ఫాదర్ మూవీ చేసిన చిరంజీవికి ఇదే సమస్య ఎదురైంది. మోహన్ లాల్ వంటి ఒక కంప్లీట్ యాక్టర్ పోషించిన పాత్రను చేయడం నిజంగా ఛాలెంజ్.
గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో చిరంజీవికి రీమేక్స్ ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఎదురైంది. తెలుగు కంటెంట్ దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుండగా మీరేమో ఇతర భాషల చిత్రాలు రీమేక్ చేస్తున్నారని ఒక విలేకరి అడిగారు. దీనికి చిరంజీవి ఆసక్తికర సమాధానం చెప్పారు. నిజానికి రీమేక్స్ చేయడమే ఛాలెంజ్ అన్నారు. రీమేక్ చేసినప్పుడు ఖచ్చితంగా పోలికలు వస్తాయి. ఆ కంపారిజన్స్ తట్టుకొని నిలబడగలననే కాన్ఫిడెంట్ నాకుంది. రీమేక్స్ ని ఎందుకు చిన్నచూపు చూస్తారో అర్థం కాదని అన్నారు.
Also Read: The Ghost Collections: ‘ది ఘోస్ట్’ మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం
ఇక గాడ్ ఫాదర్ మూవీలో మూడు పాత్రలు కీలకం. అవి చిరంజీవి, సత్యదేవ్, నయనతార చేశారు. ఒరిజినల్ లూసిఫర్ లో ఈ పాత్రలను మోహన్ లాల్, వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్ చేయడం జరిగింది. చిరంజీవి చెప్పినట్లు ఒరిజినల్ లో చేసిన ఆ ముగ్గురితో పోటీ పడడం రియల్ ఛాలెంజ్. అయితే రీమేక్ గాడ్ ఫాదర్ లో నటించిన ముగ్గురు కూడా సామాన్యులు కాదు. ఒకరు మెగాస్టార్ అయితే మరొకరు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ముగ్గురికీ ఏమాత్రం తగ్గకుండా, ఒక విధంగా కొంచెం మించే చేశారు.
మించి అని ఎందుకు అనాల్సి వస్తుందంటే… లూసిఫర్ చిత్ర ప్లాట్, స్టోరీ లైన్ మాత్రమే తీసుకున్న దర్శకుడు మోహన్ రాజా గాడ్ ఫాదర్ కి సమూల మార్పులు చేశారు. ఒక స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ లెక్క తెరకెక్కించారు. ఒరిజినల్ లో మోహన్ లాల్ పాత్ర నిడివి కేవలం 50 నుంచి 60 నిమిషాలు మాత్రమే. గాడ్ ఫాదర్ లో చిరంజీవి ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. అలాగే ఒరిజినల్ లో లేని పది పాత్రలను కొత్తగా సృష్టించి గాడ్ ఫాదర్ స్క్రిప్ట్ కి జత చేశారు. కాబట్టి గాడ్ ఫాదర్, లూసిఫర్ మధ్య ఆ చిత్రాలలో నటుల మధ్య పోలికలు అనవసరం.
Also Read: Godfather vs Ghost: చిరు వర్సెస్ నాగ్… మధ్యలో నేన్నానంటూ డెబ్యూ హీరో… దసరా బరిలో విన్నర్ ఎవరు?