https://oktelugu.com/

పాపం ఖుష్బూ.. కంటికి కత్తి తగిలి గాయం

సీనియర్ నటి, చిరంజీవి, వెంకటేశ్ సహా పలువురు స్టార్ హీరోలతో నటించిన ఖుష్బూ కంటికి గాయమైంది. తన ఎడమ కంటికి కత్తి తగిలి గాయం కాయడంతో చికిత్స చేయించుకుంది. ఈ విషయాన్ని ఖుష్బూనే స్వయంగా వెల్లడించింది. ఈ రోజు ఉదయం కత్తి తగలడంతో తన కంటికి గాయమైందని ట్వీట్‌ చేసింది. ఒక కంటికి పూర్తిగా బ్యాండేజీ వేసిన ఫొటోను షేర్ చేసింది. కొంతకాలం పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు చెప్పింది. తొందర్లోనే మీ ముందుకు వస్తానని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 19, 2020 / 05:16 PM IST
    Follow us on


    సీనియర్ నటి, చిరంజీవి, వెంకటేశ్ సహా పలువురు స్టార్ హీరోలతో నటించిన ఖుష్బూ కంటికి గాయమైంది. తన ఎడమ కంటికి కత్తి తగిలి గాయం కాయడంతో చికిత్స చేయించుకుంది. ఈ విషయాన్ని ఖుష్బూనే స్వయంగా వెల్లడించింది. ఈ రోజు ఉదయం కత్తి తగలడంతో తన కంటికి గాయమైందని ట్వీట్‌ చేసింది. ఒక కంటికి పూర్తిగా బ్యాండేజీ వేసిన ఫొటోను షేర్ చేసింది. కొంతకాలం పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు చెప్పింది. తొందర్లోనే మీ ముందుకు వస్తానని ట్వీట్‌ చేసింది. అయితే, తనకు గాయం ఎలా అయిందన్న విషయాన్ని ఆమె వెల్లడించలేదు. ఇంట్లోనే ఆమె గాయపడినట్టు అర్థం అవుతోంది. బ్యాండేజీ వేసుకున్నప్పటికీ ఆమె మొహంలో ఎలాంటి దిగులు కానీ, బాధ కానీ కనిపించడం లేదు. కాబట్టి గాయం చిన్నదే అని అర్థమవుతోంది. ఇక, ఇలాంటి పరిస్థితుల్లోనూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఖుష్బూ తన అభిమానులను కోరడం విశేషం. అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించే బయటకు వెళ్లాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. కాగా, గాయం నుంచి ఖుష్బూ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

    Also Read: సాంగ్స్ కోసం ‘పుష్ప’ను సిద్ధం చేస్తున్నారు !

    ముంబైలో పుట్టిన ఖుష్బూ దక్షిణాదిలో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. తమిళ్‌, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో అనేక సినిమాల్లో నటించింది. యంగ్‌ ఏజ్‌లో సౌత్లో దాదాపు అందరు పెద్ద స్టార్ల సరసన నటించిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సీరియర్ నటిగా, హోస్ట్‌గా, ప్రొడ్యూసర్ గా బిజీగా ఉంది. తెలుగులో చివరగా 1993లో పేకాట పాపారావులో హీరోయిన్‌గా నటించింది. 13 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఆమె 2006లో స్టాలిన్‌లో చిరంజీవి అక్కగా నటించి రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యమదొంగలో ఓ చిన్న పాత్ర చేసింది. రెండేళ్ల కిందట వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’లో కీలక పాత్రలో నటించింది.