https://oktelugu.com/

కేసీఆర్ పై పోస్టు పెట్టినందుకు యువకుడి అరెస్ట్..! అదే చట్టం ప్రభుత్వానికి వర్తించదా?

కొద్ది వారాల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకిందని కొన్ని వార్తలు వచ్చాయి. చివరికి అవి ఫేక్ న్యూస్ అని నిర్ధారణ అయిపోయాయి కూడా. అయితే ఈ పోస్ట్ పెట్టినందుకు రాజు అనే ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అంతా బాగానే ఉంది. అసలు ఒక ఫేక్ పోస్ట్ పెట్టినందుకు దుబాయ్ నుండి ముంబైకి పిలిపించి లాక్ అవుట్ నోటీసులు మీద హైదరాబాద్ కు తీసుకొని వచ్చి మరీ…. ఆ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 19, 2020 / 05:00 PM IST
    Follow us on

    కొద్ది వారాల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకిందని కొన్ని వార్తలు వచ్చాయి. చివరికి అవి ఫేక్ న్యూస్ అని నిర్ధారణ అయిపోయాయి కూడా. అయితే ఈ పోస్ట్ పెట్టినందుకు రాజు అనే ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అంతా బాగానే ఉంది. అసలు ఒక ఫేక్ పోస్ట్ పెట్టినందుకు దుబాయ్ నుండి ముంబైకి పిలిపించి లాక్ అవుట్ నోటీసులు మీద హైదరాబాద్ కు తీసుకొని వచ్చి మరీ…. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

    ఈ తతంగం మొత్తం జరిపేందుకు పోలీసులకు చాలా సమయం పట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పై అసత్య లేదా ఫేక్ పోస్ట్ చేసినందుకుగాను అతనిని అరెస్టు చేయడం కరెక్టే. మరి కొద్ది రోజుల క్రితం ఒక టీవీ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో చూపిస్తున్న కరోనా మరణాలు కన్నా ఎక్కువ మృతదేహాలను కాల్చేస్తున్నట్లు బయటపడింది. ఆ టీవీ ఛానల్ తన టిఆర్పి కోసం ఒకసారి ఆ న్యూస్ వేసి వదిలేసింది. మరి ఇప్పుడు హెల్త్ బులిటెన్ ఫలితాలపై చర్యలు తీసుకునేది ఎవరు? అది రోజూ జనాలకు ఫేక్ నెంబర్లు చూపించినట్లు కాదా…? అని నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

    అసలు హైదరాబాదులో లాంటి మహానగరంలో… ఇంకా చెప్పాలంటే దక్షిణాదిన ఉన్న కరోనా కేంద్రాలలో ఒకటైన ఈ మహానగరంలో సరిగ్గా టెస్టులు జరుపకుండా లెక్కకు మిక్కిలి కేసులు టెస్టింగ్ కు నోచుకోకుండా…. ఎంతో మంది జనాలు కరోనాతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటూ ఉంటే…. వారికి ఆ గతి పట్టించిన వారిని అరెస్టు చేసే వారే లేరా? అన్నది విపక్షాల ప్రశ్న. ఒక ఫేక్ పోస్ట్ చేసినందుకు దుబాయ్ నుండి పిలిపించి అరెస్టు చేయించడం న్యాయమే. మరి హైదరాబాద్ లోనే ఉంటూ సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టుకుంటూ…. ఫార్మ్ హౌస్ లో వీలు చిక్కినప్పుడల్లా సేద తీరుతూ.. ప్రైవేటు ఆసుపత్రుల అక్రమాలను గాలికి వదిలేసిన అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రికి మాత్రం ఈ చట్టాలు వర్తించవా…? అసలు నెంబర్లు వాస్తవమేనా… కాదా అని చెక్ చేసే వారు ఎవరూ లేరా…? అన్నది ప్రజల వాదన.

    “హైకోర్టు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా పెడచెవిన పెట్టే వారికి చట్టాలు, న్యాయాలు వర్తించవా…?” అని కేసీఆర్ ప్రభుత్వం పై పలువురు ధ్వజమెత్తారు. మరి వీటికి ఆన్సర్ మీ దగ్గర ఉందా సీఎం సాబ్…?