https://oktelugu.com/

శ్రీరాముడు ప్రభాస్‌, సీత కీర్తి సురేషేనా..!

టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ గ్లోబల్‌ స్టార్ అయ్యాడు. బాహుబలి మేనియా తర్వాత మన డార్లింగ్ మార్కెట్‌ పరిధి అమాంతం పెరగడంతో బాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకులు ప్రభాస్‌పై ఫోకస్‌ పెట్టారు. మనోడిపై ఎంత పెట్టుబడి పెట్టిన తిరిగొస్తుందని భావిస్తున్నారు. అలాగే, ఆరడుగుల ఆజానుబాహుడు కావడంతో అతని బాడీని, బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో ఉంచుకొని కథలు రెడీ చేస్తున్నారు. ఇకపై ప్రభాస్‌ చేసే అన్ని చిత్రాలు పాన్‌ ఇండియా మూవీసే కానున్నాయి. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 19, 2020 / 05:43 PM IST
    Follow us on

    టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ గ్లోబల్‌ స్టార్ అయ్యాడు. బాహుబలి మేనియా తర్వాత మన డార్లింగ్ మార్కెట్‌ పరిధి అమాంతం పెరగడంతో బాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకులు ప్రభాస్‌పై ఫోకస్‌ పెట్టారు. మనోడిపై ఎంత పెట్టుబడి పెట్టిన తిరిగొస్తుందని భావిస్తున్నారు. అలాగే, ఆరడుగుల ఆజానుబాహుడు కావడంతో అతని బాడీని, బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో ఉంచుకొని కథలు రెడీ చేస్తున్నారు. ఇకపై ప్రభాస్‌ చేసే అన్ని చిత్రాలు పాన్‌ ఇండియా మూవీసే కానున్నాయి. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘రాధేశ్యామ్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా ప్రభావం తగ్గితే ఆ మూవీ ఈ ఏడాది చివర్లో లేదా 2021 మొదట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు వైజయంతీ మూవీస్‌ బ్యానర్ పై నాగ్‌ అశ్విన్‌తో ఓ సినిమాకు ప్రభాస్‌ ఒప్పుకున్నాడు. భారీ బడ్జెట్‌తో పాటు బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపిక పడుకోన్‌ ఫీమేల్‌ లీడ్‌ చేస్తుండడంతో ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టని మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఇప్పుడు బాలీవుడ్‌ అగ్ర దర్శకుడు ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్‌’ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు ప్రభాస్‌.

    Also Read: పాపం ఖుష్బూ.. కంటికి కత్తి తగిలి గాయం

    ఈ మూవీ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. చెడుపై విజయం సాధించిన మంచికి వేడుక అనే ట్యాగ్‌లైన్‌ వస్తున్న ఈ మూవీ దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ భూషన్‌ కుమార్ ప్రొడ్యూసర్. ఇది పౌరాణిక గాథతో కూడిన సోషియో ఫాంటసీ చిత్రం. భారతీయ ఇతిహాసం ఆధారంగా త్రీడీలో రూపొందించనున్నారు. టైటిల్‌ డిజైన్‌ చూస్తుంటే ఇందులో ప్రభాస్‌ శ్రీరాముడిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ మూవీలో ప్రభాస్‌ సరసన సీతగా కీర్తి సురేశ్‌ పేరును పరిశీలిస్తున్నారు. ఈ మధ్య సౌతిండియాలో వరుస హిట్లతో దూసుకెళ్తోంది కీర్తి. ముఖ్యంగా ‘మహానటి’తో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న తర్వాత ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అమెజాన్‌లో రిలీజైన్‌ ఆమె ‘పెంగ్విన్‌’ చిత్రాన్ని హిందీ జనాలు కూడా చాలా మంది చూశారు. చీరకట్టులో ఒదిగిపోవడమే కాకుండా అద్భుతమైన హావభావాలను పలికించడంలో కీర్తి దిట్ట. దాంతో, సీత పాత్రకు ఆమె అయితే న్యాయం చేసుందని చిత్రం బృందం భావిస్తోందని సమాచారం.

    Also Read: అయ్యో.. పాపం బాలయ్య.. !

    కాకపోతే ఆమె హైట్‌ కాస్త ప్రతికూలం అయ్యేలా ఉందని టాక్. కీర్తి హైట్‌ తక్కువే. ఆరడుగుల ప్రభాస్‌ సరసన ఆమె సెట్‌ అవుతుందా? అని ఆలోచన కూడా చేస్తున్నారట మూవీ మేకర్స్‌. అలాగే, ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ప్రభాస్‌ స్టార్డమ్‌తో పాటు పాన్‌ ఇండియా మూవీ కావడంతో కీర్తినే ఫైనల్‌ చేస్తారా? బాలీవుడ్‌లో మరెవరినైనా పరిశీలిస్తారా అన్నది తేలాలి. ఒకవేళ చాన్స్‌ వస్తే మాత్రం కీర్తి కెరీర్ మరో మెట్టు ఎక్కిన్టే అనొచ్చు. కాగా, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కే ఆదిపురుష్ను తమిళ్‌, మలయాళం, కన్నడ తో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్‌ చేయనున్నారు.