https://oktelugu.com/

Bigg Boss S8 : బిగ్ బాస్ 8 టైటిల్ కోసం కుమారీ ఆంటీ భారీ స్కెచ్… హౌస్ లోకి వెళ్లక ముందే గేమ్ స్టార్ట్!

బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక కంటెస్టెంట్స్ గేమ్ ఆడతారు. కొందరు మాత్రం వెళ్లక ముందే పక్కా ప్రణాళికలు వేస్తారు. కుమారీ ఆంటీ అదే చేస్తుంది. టైటిల్ కోసం ఆమె భారీ స్కెచ్ వేయగా... అనూహ్యంగా బయటపడింది. కుమారీ ఆంటీ తెలివితేటలకు జనాలు షాక్ అవుతున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 27, 2024 / 10:52 AM IST
    Follow us on

    Bigg Boss S8 : హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తూ కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో ఆమె ఒక సెలెబ్రెటీ గా మారిపోయింది. టీవీ షోలు, సీరియల్స్ లో కనిపిస్తూ.. బుల్లితెరపై కూడా కుమారి ఆంటీ సందడి చేసింది. మొన్నటి వరకు కుమారి ఆంటీ పేరు నెట్టింట మారుమోగింది. రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ ఆమె చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్సో తెలిసిందే. కాగా ఇటీవల బాలీవుడ్ నటుడు సోనూసూద్ కుమారీ ఆంటీ ఫుడ్ కోర్ట్ ని సందర్శించారు.

    దీంతో కుమారి ఆంటీ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడది బిగ్ బాస్ వరకు దారితీసింది. కుమారి ఆంటీ బిగ్ బాస్ 8కి వెళ్లడం దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు. కానీ ఆమె మాత్రం అసలు బిగ్ బాస్ అంటే నాకేమి తెలియదు. అలాంటిది ఏమీ లేదు అంటూనే మరోవైపు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తుంది. చాలా తెలివిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫొటోలతో ప్రచారం చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ ని వాడుకుంటూ పవన్ ఫ్యాన్స్ ఆమెను సపోర్ట్ చేసేలా స్కెచ్ లు వేస్తుంది.

    తన ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టింది. పైగా ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినా పవన్ కళ్యాణ్ ఫోటో బాగా కవర్ అయ్యేలా చూసుకుంటుంది. అయితే ఇంతకాలం లేని ఈ అభిమానం ఇప్పుడు సడన్ గా, అది కూడా బిగ్ బాస్ కి వెళ్లే ముందు కుమారి ఆంటీ లో కనిపిస్తుంది. దీంతో అభిమానం పేరుతో కుమారి ఆంటీ పెద్ద ప్లానే వేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ప్రచారం మొదలు పెట్టింది అని అంటున్నారు.

    ఎందుకంటే గతంలో కూడా కుమారి ఆంటీ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది. కానీ వాటిలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించలేదు. పైగా ఆమె పవర్ స్టార్ అభిమాని అని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె కావాలనే పవన్ కళ్యాణ్ ఫోటో ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే .. కుమారి ఆంటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. బిగ్ బాస్ షో అంటే అదేదో వంటల ప్రోగ్రాం అనుకున్నా .. నాకు ఆ షో గురించి అసలు తెలియదు.

    తర్వాత మా పిల్లలు చెప్పారు ఆ షో గురించి. నేను బిగ్ బాస్ చూడను. సీరియల్స్ చూస్తానంతే. కానీ మా ఆయనకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నేను వద్దు అంటున్నా ఆయనే పంపిస్తున్నారు. నేను బిగ్ బాస్ కి వెళ్తే పని మొత్తం ఆయన పైనే పడుతుంది. నాకు సినిమా ఆఫర్లు, షోలు ఏవైనా వచ్చినా మా ఆయన నాకు సపోర్ట్ చేస్తారు వద్దనకుండా పంపిస్తారు. మా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ వల్లే ఇప్పుడు ఇలా ఉన్నా అని కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది. పల్లవి ప్రశాంత్ మాదిరి కుమారీ ఆంటీకు సింపథీ వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే టైటిల్ కొట్టిన మరో కామనర్ అవుతుంది..