https://oktelugu.com/

Olympics : ఒలింపిక్స్‌లో ఎక్కువ పథకాలు సాధించిన దేశం అదే.. దాని ప్రత్యేకత అదే.!

ప్యారిస్‌ వేదికగా 2024 ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాయి. శుక్రవారం(జూలై 26న) ప్రారంభం వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సారి 206 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 27, 2024 / 10:45 AM IST
    Follow us on

    Olympics  : ప్యారిస్‌ వేదికగా 2024 ఒలింపిక్స్‌ వేడుకలు శుక్రవారం(జూలై 26న) అట్టహాసంగా, అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈసారి ఒలింపిక్స్‌లో రికార్డుస్థాయిలో 206 దేశాల నుంచి 10,714 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 32 క్రీడల్లో 329 విభాగాల్లో విశ్వక్రీడలు జరుగనున్నాయి. ఇక ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి 1217 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ప్రారంభ వేడుకల్లో పీవీ.సింధు, శరత్‌ కమల్‌ జాతీయ పతాక బేరర్లుగా ఉంటారు. భారత్‌ విశ్వ క్రీడల్లో పాల్గొనడం ఇది 26వ సారి. గత ఒలింపిక్స్‌లో భారత్‌ ఏడు పతకాఉ సాధించింది. పథకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. భారత్‌ సాధించిన పతకాల్లో ఒక స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో 16 క్రీడా విభాగాల్లో భారత్‌ పోటీ పడనుంది. ఇదిలా ఉంటే.. 128 ఏళ్ల చరిత్ర ఉన్న ఒలింపిక్స్‌లో అత్యధిక పథకాలు సాధించిన అథ్లెట్‌గా అమెరికాకు చెందిన మైఖేల్‌ ఫెల్ప్స్‌ ఉన్నాడు. ఫెల్ప్సె 2004–2016 మధ్యలో ఏకంగా 28 మెడల్స్‌ సాధించాడు. ఇందులో 23 స్వర్ణాలు, 3, రజతాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. పెల్ప్స్‌ తర్వాత అత్యధిక పతకాలు సాధించిన ఆటగాళ్లలో లరిసా లాటినినా (సోవియనట్‌ యూనియన్‌) ఉన్నారు. 18 పతకాలు సాధించారు. తర్వాత మారిట్‌ ఝెర్గెన్‌(నార్వే–15), నికొలై యాండ్రియానోన్‌(సోవియట్‌ యూనియన్‌–15) టాప్‌ 4 స్థానాల్లో ఉన్నారు.

    అత్యధిక పతకాలు సాదించిన దేశం..
    ఇక ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశంగా యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా(యూఎస్‌ఏ) ఉంది. యూఎస్‌ఏ ఇప్పటి వరకు జరిగిన 25 ఒలింపిక్స్‌లలో 2,629 పతకాలు సాధించింది. ఇందులో 1061 స్వర్ణాలు, 830 రజతాలు, 738 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆల్‌టైమ్‌ పతకాల పట్టికలో (స్వర్ణ పతకాల వారీగా) యూఎస్‌ఏ తర్వాత స్థానంలో సోవియట్‌ యూనియన్‌ (1010), గ్రేట్‌ బ్రిటన్‌(916), చైనా(636), ఫ్రాన్స్‌(751), ఇటలీ(618), జర్మనీ(655), హంగేరీ(511), జపాన్‌(497), ఆస్ట్రేలియా(547) టాప్‌ –10లో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్‌ 56వ స్థానంలో ఉంది. భారత్‌ ఇప్పటి వరకు 10 స్వర్ణాలు, 9 రజతాలు, 16 కాంస్య పతకాలు.. మొత్తం 35 పతకాలు సాధించింది.

    129 ఏళ్ల చరిత్ర..
    ఒలింపిక్స్‌ కోసం సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. పోటీలు ప్రారంభమయ్యాయి. 33వ ఒలింపిక్‌ క్రీడలను చిరస్మరణీయం చేసేందుకు ఫ్రాన్స్‌ పూర్తి సన్నాహాలు చేసింది. 129 ఏళ్ల ఒలింపిక్‌ చరిత్రలో తొలిసారిగా ప్రారంభ వేడుకలు స్టేడియం బయట నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి సెయిన్‌ నది నుంచి పారిస్‌ క్రీడల వేడుకలు ప్రారంభమయ్యాయి. 10,500 మంది అథ్లెట్లు బోట్లపై పరేడ్‌ చేశారు. కవాతు ఆరు కిలోమీటర్ల పొడవునా సాగింది. దాదాపు 2 గంటల పాటు ఈ వేడుక జరిగింది. ప్యారిస్‌ ఒలింపిక్‌ గేమ్స్‌ 2024 యొక్క నినాదం ‘గేమ్స్‌ వైడ్‌ ఓపెన్‌’గా నిర్ణయించారు.

    ఎందుకు ప్రత్యేకం?
    చరిత్రలో తొలిసారిగా నది.. వీధుల్లో ఒలింపియన్ల పరేడ్‌ జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి 10 వేల మందికి పైగా ఒలింపియన్లు 94 బోట్లలో వేడుకల్లో పాల్గొంటారు. ఈ పడవల్లో కెమెరాలు అమర్చారు. వీటి ద్వారా పరేడ్‌ ఆఫ్‌ నేషన్స్‌ క్రీడాకారులను టీవీల్లో, ఆన్‌లైన్‌లో చూడవచ్చు. అథ్లెట్లందరూ సెయిన్‌ నదిలో పడవలపై నగరం గుండా ప్రయాణించి ట్రోకాడెరో గార్డెన్‌కు చేరుకుంటారు. ప్రారంభోత్సవం యొక్క చివరి ప్రదర్శన ట్రోకాడెరో గార్డెన్‌లోనే జరిగింది. అంతకు ముందు వీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దాదాపు 3 లక్షల మంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది. ప్యారిస్‌లో జరిగే పరేడ్‌ ఆఫ్‌ నేషన్స్‌లో గ్రీస్‌ మొదటి స్థానంలో ఉంటుంది. ఆధునిక ఒలింపిక్స్‌ 1896లో గ్రీస్‌లో ప్రారంభమయ్యాయి. అందుకే ప్రతీ ఒలింపిక్‌ పరేడ్‌లోనూ గ్రీస్‌ను ఉంచుతారు.