Nagarjuna Speech Kuberaa Success Meet: చాలా కాలం తర్వాత మన టాలీవుడ్ లో ‘కుబేర'(Kubera Movie) చిత్రం కారణంగా కాసుల గలగల వినిపిస్తుంది. థియేటర్స్ బయట హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ తో ఎక్కడ చూసినా మల్టీ ప్లెక్సులు, సింగల్ స్క్రీన్ థియేటర్స్ కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ చిత్రం కారణంగా బయ్యర్స్ ఎగ్జిబిటర్స్ ఊపిరి పీల్చుకున్నారు. మొదటి వీకెండ్ ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు నమోదు అయ్యాయి. మరో రెండు వారాల వరకు ఈ చిత్రానికి ఇదే రేంజ్ వసూళ్లు నమోదు అవుతాయని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు బయ్యర్స్. ఇది ఎంత వరకు నిజం కానుందో ఈరోజు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ ని బట్టి తెలుస్తుంది. సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో మేకర్స్ నిన్న హైదరాబాద్ లో ఒక సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.
Also Read: శేఖర్ కమ్ములను మన హీరోలు తక్కువ అంచనా వేశారా..?
ఈ ఈవెంట్ లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ముందుగా మా పెద్ద అన్నయ్య, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి మా సక్సెస్ ఈవెంట్ కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మేము కానీ, మా సినీ ఇండస్ట్రీ కానీ చిరంజీవి గారిని ఎందుకు అంత ప్రేమిస్తామో, అభిమానిస్తామో మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఇండస్ట్రీ లో ఎవరు సక్సెస్ కొట్టినా నిండు మనసుతో ఆశీర్వదించే హృదయం ఉన్నవాడు మా చిరంజీవి గారు. విక్రమ్ సినిమా సూపర్ హిట్ అయ్యినప్పుడు కమల్ హాసన్ గారిని ఇంటికి పిలిపించుకొని, డిన్నర్ చేయించి పంపాడు. అలాగే అమీర్ ఖాన్ హిందీ నుండి ఇక్కడికి వచ్చి తన సినిమాని ప్రమోట్ చేయమని కోరినప్పుడు ఎంతో స్వచ్ఛమైన మనసుతో ఆయన ఆ చిత్రాన్ని ప్రమోట్ చేశాడు’.
‘అంతేకాదు ఎంత సినిమా అయినా, ఎంత చిన్న నటుడైన, తనతో సమానమైన నటుడైన తన ఇంటికి వెళ్లి మాకు మీ చెయ్యి కావాలి అనగానే ఆయన క్షణం కూడా ఆలోచించకుండా సపోర్ట్ చేస్తాడు. అందుకే మేమంతా చిరంజీవి గారిని అంతలా అభిమానిస్తూ ఉంటాము. థాంక్యూ చిరంజీవి గారు. ఇందాక కార్ లో మేమిద్దరం వస్తున్నప్పుడు దీపక్ గా చాలా అద్భుతంగా నటించావు నాగ్. ఇన్నాళ్లు నేను చూసిన నాగ్ యేనా ఇందులో కనిపించింది అనుకున్నాను అని అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు అక్కినేని నాగార్జున. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఈవెంట్ మొత్తం ఎంతో హృద్యంగా సాగిపోయింది. సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి తప్ప సక్సెస్ మీట్స్ కి రానటువంటి ధనుష్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొని తన అనుభవాలను పంచుకున్నాడు. ధనుష్ తో పాటు మూవీ లో పని చేసిన ప్రతీ ఒక్కరు ఈ ఈవెంట్ లో పాల్గొని అద్భుతమైన ప్రసంగాలు అందించారు.
Also Read: మెగాస్టార్ చిరంజీవి కాళ్ళు మొక్కిన ధనుష్..కానీ నాగార్జున ని కనీసం పట్టించుకోలేదుగా!