Kuberaa Box Office Collection: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి టెస్ట్ ఉన్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో శేఖర్ కమ్ముల మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన డాలర్ డ్రీమ్స్ (Doller Dreams) సినిమా నుంచి నిన్న రిలీజ్ అయిన కుబేర (Kubera) సినిమా వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ ను చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా ఆయన సినిమాలకు ఫ్యామిలీ ప్రేక్షకులు, యూత్ అభిమానులు ఎక్కువగా ఉంటారు…
శేఖర్ కమ్ముల అనగానే ఆనంద్(Anand), హ్యాపీ డేస్(Happy Days), ఫిదా (Fidaa)లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆయన మొదటి నుంచి ఒక టైప్ ఆఫ్ సినిమాలను చేస్తూ చాలా మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఆయన సినిమాల్లో వర్షం, క్రికెట్, లవ్, ఐస్ క్రీమ్స్ ఇవి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి… ప్రతి సీన్ ని చాలా ఇంప్రెసివ్ గా రాసుకోవడంలో ఆయనను మించిన రచయిత లేడు. ఒక్కో సీన్ ని డిఫరెంట్ యాంగిల్ లో తెరకెక్కించడంలో ఆయనను మించిన దర్శకుడు లేడు. అందుకే శేఖర్ కమ్ముల (Shekar Kammula) అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉంటుంది. అతని సినిమాల్లో నటించడానికి నటీనటులు చాలావరకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల గారు ధనుష్ (Dhanush), నాగార్జున(Nagarjuna) లను మెయిన్ లీడ్ గా పెట్టి చేసిన కుబేర (Kubera) సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని సూపర్ సక్సెస్ దిశగా ముందుకు సాగుతోంది…
ఇక ఈ సినిమా మొదటిరోజు 30 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. శేఖర్ కమ్ముల కెరియర్ లోనే ఇంత భారీ ఓపెనింగ్స్ రావడం అనేది ఇదే మొదటిసారి… ఈ మూవీ 125 కోట్ల బడ్జెట్ తెరకెక్కింది. రిలీజ్ కి ముందే ఈ మూవీ తెలుగు, తమిళ్ కలిసి 65 కోట్ల బిజినెస్ జరుపుకుంది…
ఇక మొత్తానికైతే 126 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ గా నిలుస్తోంది. లేకపోతే మాత్రం సినిమా నష్టాలను మిగిల్చే అవకాశాలైతే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి వస్తున్న టాక్ ను బట్టి చూస్తే ఈ సినిమా 4 రోజుల్లోనే 100 కోట్లను క్రాస్ చేసి ముందుకు దూసుకెళ్తుంది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా శేఖర్ కమ్ముల ఇక ముందు చేయబోయే సినిమాలు సైతం తన టేస్ట్ కి తగ్గట్టుగానే ఉంటాయని కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పోయి తనది కానిది తాను చూపించలేనని చెప్పాడు. అలాగే తనకి ఏదైతే కంఫర్ట్ గా ఉంటుందో, ఈ కథనైతే ఆయన బలంగా నమ్ముతాడో దాన్నే స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తానని తెలియజేశాడు. కుబేర సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ తో ఇండస్ట్రీలో మరికొన్ని రికార్డులను క్రియేట్ చేయాలని కోరుకుందాం…