International Yoga Day 2025 Visakhapatnam: విశాఖలో( Visakhapatnam) అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. దాదాపు 5 లక్షల మందితో ఒకేసారి యోగాసనాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకు తగ్గట్టుగా కొద్ది నెలల నుంచి సన్నాహాలు ప్రారంభించింది. ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 26 కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక కంపార్ట్మెంట్లు, వేదికలు ఏర్పాటు చేసింది. యోగాసకులతోపాటు ప్రత్యేక పర్యవేక్షకులను సైతం నియమించింది. ప్రతి కంపార్ట్మెంట్కు ఒక ఇన్చార్జి తో పాటు సమన్వయానికి అధికారులను సైతం నియమించింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి జనాన్ని తరలించేందుకు దాదాపు పదివేల బస్సులను ఏర్పాటు చేసింది. ఒక్క విశాఖ జిల్లా నుంచి మూడు లక్షల 25 వేల మంది వచ్చేలా ఏర్పాటు చేసింది. వివిధ జిల్లాల నుంచి 1.75 లక్షల మంది వస్తారని అంచనా వేసింది. అయితే ఈరోజు జరిగిన యోగా దినోత్సవానికి మాత్రం 3.01 లక్షల మంది హాజరైనట్లు తేలింది. దీంతో ఈ యోగా దినోత్సవం గిన్నిస్ బుక్ రికార్డులో నమోదయింది. వరల్డ్ రికార్డు సృష్టించింది.
Also Read: యోగా వల్ల ప్రయోజనాలు ఏంటి? ఎందుకు చేయాలి?
* గత పదేళ్లుగా నిర్వహణ
గత పది సంవత్సరాలుగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని భారత ప్రభుత్వం( Indian government) అధికారికంగా నిర్వహిస్తూ వస్తోంది. తాజాగా విశాఖలో జరిగిన ఈ దినోత్సవం 11వది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. సాగర తీరంలో సంద్రం ఒడ్డున సరికొత్త ఉత్సాహంతో ఈ కార్యక్రమం జరిగింది. గతంలో సూరత్ లో నిర్వహించిన యోగా రికార్డును ఇది అధిగమించింది. అప్పట్లో గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు 1.47 లక్షల మంది అప్పట్లో యోగ వేశారు. అదో ప్రపంచ రికార్డు గా ఉండేది. కానీ తాజాగా విశాఖ రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు మూడు లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకుంది ఈ కార్యక్రమం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తోంది.
* పచ్చటి తివాచి పై లక్షల మంది..
విశాఖ నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం( International yoga day ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పచ్చటి తివాచీ పై మూడు లక్షలకు పైగా జనాలు ఒకేసారి ఆసనాలు వేస్తారు. మొత్తం 326 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. వేకువ జాము నుంచే సాగర పరిసరాల్లో సందడి నెలకొంది. ఆంధ్ర యూనివర్సిటీ మైదానం తో పాటు గోల్ఫ్ క్లబ్ , పీఎం పాలెం క్రికెట్ స్టేడియం, పోర్ట్ స్టేడియం, రైల్వే ఎగ్జిబిషన్ మైదానం, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం తో పాటు మొత్తం 18 గ్రౌండ్లలో యోగాసనాలు వేశారు.