Yoga Day 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతీ ఏడాది జూన్ 21వ తేదీన జరుపుకుంటారు. అయితే యోగా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. డైలీ యోగా చేయడం వల్ల యంగ్ లుక్‌లో ఉండటంతో పాటు అన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఎక్కువ శాతం మంది ఉదయం పూట యోగా చేస్తుంటారు. మరికొందరికి సమయం లేకపోవడం వల్ల సాయంత్రం, రాత్రి సమయాల్లో యోగా చేస్తుంటారు. అయితే యోగా ఆరోగ్యానికి మంచిది కదా.. ఏ సమయంలో చేసినా పర్లేదని కొందరు భావిస్తుంటారు. కానీ యోగాను చేయాల్సిన సమయంలోనే చేస్తేనే ఆరోగ్యానికి మంచిది. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మరికొందరికి యోగా చేయడానికి కూడా సమయం ఉండదు. దీంతో ఏదో గాబారాగా చేస్తుంటారు. అయితే యోగా అనేది చాలా ముఖ్యమైనది. చేయాల్సిన పద్ధతిలో చేస్తేనే ఆరోగ్యానికి మంచిది. లేకపోతే యోగా చేసిన ఫలితం కూడా ఉండదని నిపుణులు అంటున్నారు. అయితే యోగా ఎలా చేస్తే ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో చూద్దాం.
ఆఫీస్ లేదా ఇతర పనులు వల్ల చాలా మంది యోగాసనాలు తొందరగా వేస్తుంటారు. అంటే ఏదో చేయాలని ఫాస్ట్‌గా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల యోగా బెనిఫిట్స్ శరీరానికి అందవని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే యోగాను నెమ్మదిగా ఎక్కువ సమయం పాటు ప్రశాంతంగా చేయాలి. మానసిక ప్రశాంతం కోసం యోగా చేస్తారు. కానీ తొందరగా ఆందోళనతో యోగా చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల యోగా చేసిన ఫలితం కూడా ఉండదు. యోగాను ఎప్పుడైనా కూడా నెమ్మదిగా చేస్తుండాలి. అలాగే కాస్త శ్రద్ధ పెట్టి యోగా చేయాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావని నిపుణులు అంటున్నారు. యోగా చేయడం వల్ల ఆందోళనలు అన్ని కూడా తొలగిపోతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు రాకుండా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
యోగాను ప్రశాంతంగా చేయాలి. అందులోనూ ఉదయం లేదా సాయంత్రం వేళలో ఏదో ఒక సమయంలో చేయాలని నిపుణులు అంటున్నారు. అయితే కొందరికి సమయం లేకపోవడంతో భోజనం చేసిన తర్వాత యోగా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. భోజనం చేసిన రెండు లేదా మూడు గంటల తర్వాత మాత్రమే యోగా చేయాలని నిపుణులు అంటున్నారు. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, అసిడిటీ వంటి సమస్యలు కూడా రావని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళలో యోగా ఒకే సమయానికి చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.