Actor Brahmaji: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల వివాదం రోజురోజుకూ హాట్‌టాపిక్‌గా మారిపోతోంది. కరోనా మహమ్మారి కారణంగా నెలల తరబడి థియేటర్లు మూసుకుపోయినప్పుడు వచ్చిన నష్టాల కంటే.. టికెట్ ధరల తగ్గింపుపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత నష్టాన్ని తెచ్చి పెడుతున్నాయని థియేటర్ల యాజమాన్యం భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కొందరు ఎగ్జిబిటర్లు, నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. క్షుణ్నంగా పరిశీలించిన ధర్మాసనం.. జీవోను రద్దు చేసింది. అయితే, హైకోర్డు సూచనలను ఏపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడమే లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే.. థియేటర్లు మూసేయడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే మా వల్ల కాదంటూ.. కొంతమంది ఓనర్లు థియేటర్లను మూసేశారు. తెలంగాణలో థియేటర్ పార్కింగ్ ఫీసు, ఆంధ్రాలో ఉన్న సినిమా టికెట్ ధర కంటే ఎక్కువే ఉందని ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పలువురు సిసీ ప్రముఖులు స్పందించారు. జగన్ దీనిపై మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి కూడా చేశారు.
@ysjagan Sirr.. andhariki varalu isthunnaru.. papam theatre owners ki.. cinema vaallaki help cheyyandi.. itlu Mee nanna gari abhimaani 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 https://t.co/wUV2yGzHUG
— Brahmaji (@actorbrahmaji) December 22, 2021
తాజాగా, టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. జగన్ సర్.. అందరికీ వరాలిస్తున్నారు. పాపం థియేటర్ ఓనర్లకు, సినిమా వాళ్ల వైపు ఓ లుక్కేయండి. ఇట్లు మీ నాన్నగారి అభిమాని.. అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశారు బ్రహ్మాజీ. ఈ ట్వీట్లో తెలంగాణ థియేటర్ పార్కింగ్ ఫీజు, ఆంధ్రాలో సినిమా టికెట్ రేట్లను జత చేశారు. మరి ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమపై దయ తలుస్తుందేమో చూడాలి.