Kubera Advance Booking: శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) హీరోలుగా నటించిన ‘కుబేర'(Kubera Movie) చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ‘లవ్ స్టోరీ’ చిత్రం తర్వాత మూడేళ్లకు శేఖర్ కమ్ముల నుండి వస్తున్న చిత్రమిది. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే భారీ గ్యాప్ రావడం, ఆడియన్స్ మైండ్ సెట్ పూర్తిగా మారడం వల్ల శేఖర్ కమ్ముల సినిమాలకు ఆదరణ తగ్గిందా?, ఆయన గత చిత్రం ‘లవ్ స్టోరీ’ కి అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి, కానీ ఆ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ‘కుబేర’ కి జరగడం లేదు అనేది వాస్తవం. తెలుగు వెర్షన్ లో అయినా పర్వాలేదు అనే రేంజ్ లో బుకింగ్స్ జరిగాయి కానీ, తమిళ వర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చిల్లరే అని చెప్పొచు.
ఉదాహరణకు చెన్నై సిటీ మొత్తానికి కలిపి ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో కేవలం రెండు షోస్ మాత్రమే ఫాస్ట్ ఫిల్లింగ్ లోకి వచ్చాయి. ఇక నార్త్ అమెరికా లో అయితే తమిళ వెర్షన్ కి కేవలం 50 టిక్కెట్లు మాత్రమే అంమ్ముడుపోయాయి. ఇలాంటి సినిమాలకు ధనుష్ లాంటి హీరోలను తీసుకునేది తమిళ మార్కెట్ బాగా కలిసి వస్తుందనే. అలాంటి తమిళ మార్కెట్ లో ఇలాంటి చిల్లర వస్తే ధనుష్ లాంటి స్టార్స్ ని తీసుకొని ఏమి ఉపయోగం మీరే చెప్పండి. ఇక తెలుగు వెర్షన్ కి సంబంధించిన గడిచిన 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో కేవలం 27 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు కనీసం కోటి రూపాయిలు కూడా రాలేదు. శేఖర్ కమ్ముల బ్రాండ్ ఇమేజ్, అక్కినేని నాగార్జున,ధనుష్, రష్మిక లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఈ సినిమా ఆడియన్స్ ని విడుదలకు ముందు ఆకర్షించలేకపోయింది.
అయితే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కడైనా బాగా జరిగిందా అంటే అది ఓవర్సీస్ లో మాత్రమే జరిగింది అని చెప్పొచ్చు. నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి నిన్నటి వరకు 2 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రీమియర్స్ మొదలయ్యే సమయానికి 3 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ప్రీమియర్స్ ముగిసే లోపు 5 లక్షల డాలర్ల గ్రాస్ మార్కుని అందుకోవచ్చు. ఇది అక్కినేని నాగార్జున మరియు ధనుష్ కెరీర్ బెస్ట్ ప్రీమియర్స్ అని చెప్పొచ్చు. ఓవర్సీస్ ఆడియన్స్ ట్రైలర్ బాగుంటే కచ్చితంగా కదులుతారు. ఈ సినిమా ట్రైలర్ బాగుంది కాబట్టి అక్కడ క్లిక్ అయ్యింది కానీ, తెలుగు రాష్ట్రాల్లో మరియు తమిళనాడు లో మాత్రం నిరాశపరిచింది. కనీసం టాక్ వస్తే జనాలు కదులుతారేమో చూడాలి. చాలా కాలం నుండి సరైన సక్సెస్ లేక ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ, అటు తమిళ సినిమా ఇండస్ట్రీ సంక్షోభం లో ఉంది. ఈ సినిమా ఆ సంక్షోభం నుండి కాపాడుతుందో లేదో చూడాలి.