Kubbra Sait: జీవితమంటేనే కష్ట సుఖాల సమ్మేళనం. కావడి కుండల కలబోత. ఒకవైపు కష్టాలు. మరోవైపు సుఖాలు అందరికి ఉంటాయి. కాకపోతే వాటిని దాటుకుని కొందరు జీవితంలో ఎదుగుతారు. మరికొందరు వాటిని తలుచుకుని కుమిలిపోతూ జీవితంలో ఎదుగుదల లేకుండా ఉంటారు. జీవితంలో మంచి, చెడు సమానమే. వాటిని మనమే ఎదుర్కోవాలి. మంచైనా, చెడైనా భయపడకుండా వాటిని అధిగమించాలి. సుఖమొస్తే సంతోషం బాధ కలిగితే దుఖించడం సాధారణ మనుషులు చేసే పని. మనం సాధారణ వ్యక్తుల్లా కాకుండా నైపుణ్యత కలిగిన వారిగా మసలుకునే ప్రయత్నం చేయాలి. కష్టాలకు ఎదురీది మన టాలెంట్ ను నిరూపించుకోవాలి. అప్పుడే మనకు సరైన గుర్తింపు వస్తుంది.

ఆడపిల్లలైతే వారి జీవితాలు అరటాకులే. ముల్లు పోయి అరటాకు మీద పడినా అరటాకు వచ్చి ముల్లు మద పడినా చిరిగేది అరిటాకే. అందుకే ఆడపిల్లల జీవితాలు సున్నితంగా ఉంటాయి. ఈ కోణంలో నటి కుబ్ర సైత్ కూడా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. తనకు కలిగిన బాధను తన పుస్తకంలో పంచుకుంది. తనలో కలిగిన బాధను వెలిబుచ్చింది. తను రాసిన ఓపెన్ బుక్ నాట్ క్వైట్ ఎ మెమొయిర్ అనే పుస్తకంలో తన అనుభవాలు వెల్లడించింది. ఎంతో కాలంగా తను అనుభవిస్తున్న వేదనను బయటపెట్టింది.
Also Read: Nayanthara Wedding: నయనతార పెళ్లి వీడియో స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్ కు ఎన్ని కోట్లకు అమ్మారో తెలుసా?
నాకు 17 ఏళ్లప్పుడు మా కుటుంబం బెంగుళూరులో ఓ రెస్టారెంట్ కు తరచూ వెళ్లేది. అలా ఆ రెస్టారెంట్ యజమానితో మాకు అనుబంధం ఏర్పడింది. మా అమ్మకు అతడు డబ్బు కూడా సాయం చేసేవాడు. తరువాత అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మీద చేతులు వేసే వాడు. మా అమ్మ ముందే నన్ను ముద్దు పెట్టుకునే వాడు. ఓ సారి హోటల్ కు తీసుకెళ్లి నాకు ముద్దులు పెట్టాడు. తరువాత మిగతా పనులు కూడా చేశాడు. మా కుటుంబానికి అతడు చేస్తున్న సాయంతో ఏమి అనలేకపోయేదాన్ని. అలా నన్ను పలుమార్లు అలా హోటల్ కు తీసుకెళ్లి విచిత్రంగా ప్రవర్తించేవాడు.

అలా నా కన్యత్వాన్ని కోల్పోయాను. జీవితంలో ఎదురయ్యే దెబ్బలకు ఎదురు నిలవాలి. అప్పుడే మనం పోటీలో గెలిచి తీరుతాం. కానీ ఆడపిల్లల జీవితాలు ఎదురు నిలిచే సంఘటనలు తక్కువే. పరిస్థితుల ప్రబావమో, ఆర్థిక ఇబ్బందులో ఏవో కారణాలు ఆడపిల్లలను మాట్లాడకుండా చేస్తాయి. జీవితంలో ఎదిగేందుకు అవకాశాలున్నా కూడా మన భవిష్యత్ గాడి తప్పే ఘటనలు కూడా ఉండటం సహజమే. కానీ వీటికి కుంగిపోకూడదు. ఓ సవాలుగా తీసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకే ప్రయత్నం చేయాలి కానీ ఇలాంటి వాటిని తలుచుకుని బాధలో ఉండకూడదు.
నటిగా కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నా చివరకు మాత్రం తన యాత్ర సాఫీగానే సాగుతున్నట్లు తెలిపింది. అందుకే కష్టాలకు కుంగిపోకుండా ధైర్యమే ఆయుధంగా చేసుకుని ముందుకు నడవాలి. దీక్ష, పట్టుదల వదలకుండా జీవితాన్ని ఓ చాలెంజ్ గా చేసుకుని పోరాడటమే అలవర్చుకోవాలి. ఇందుకోసం మనం అన్నింటిని వదులుకోవాలి. త్యాగాలే ఆయుధాలుగా చేసుకుని శ్రమించాలి. జీవితాన్ని నందనవనంగా మలుచుకోవాలి. అప్పుడే మన జన్మకు సార్థకత వస్తుంది.
Also Read:
Hyderabad Gang Rape Case: ఒకరి తర్వాత ఒకరు.. బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో సంచలన నిజాలు