Nayanthara Wedding: సెలబ్రెటీల పెళ్లి అందరి ఆసక్తి ఉంటుంది. వారి పెళ్లి చూడాలన్న కోరిక ఉంటుంది. కానీ ఇప్పుడు పెళ్లిని కూడా క్యాష్ చేసుకుంది మన నయనతార. పెళ్లి జరిగే హోటల్ లోకి సామాన్యులు ఎంట్రీ ఇవ్వకుండా హోటల్ లో క్యూఆర్ సిస్టం పెట్టి వచ్చే అతిథులకు మాత్రమే ప్రవేశం కల్పించింది. పెళ్లికి పిలవని వారికి హోటల్ లోకి నో ఎంట్రీ పెట్టింది. నయనతార ఇంత చేసింది తన పెళ్లి వీడియోను అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికేనన్న విషయం బయటపడింది.
ఇప్పుడు ఎక్కడ చూసినా అందాల కుందనపు బొమ్మ నయనతార పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. ఆమె పెళ్లి ఎలా జరిగింది? పెళ్లిలో ఏం పెట్టారు? ఎలా నిర్వహించారు? అతిథి మర్యాదలపై ఆరాతీస్తున్నారు. ఈ పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో వైరల్ గా మారాయి. ముఖ్యంగా నయనతార పెళ్లిని కూడా వ్యాపారం చేసిందని తాజాగా తెలిసింది. తన పెళ్లి వీడియోలు, ఫొటోలు కూడా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ కు భారీ రేటుకు కట్టబెట్టిందట.. అది ఎంతమొత్తమో తెలిసి ఇప్పుడు అందరూ నోరెళ్లబెడుతున్నారు.
Also Read: Nayanthara Wedding Saree: నయనతార ధరించిన ఆ ఎర్రటి చీర ఎవరు తయారు చేశారు? ధర ఎంతో తెలుసా?
సినీ తారల పెళ్లిళ్లు కనువిందుగా ఉంటాయి తెలుగుసహా దక్షిణాదిలో ఇప్పుడు నయనతార-విఘ్నేష్ ల పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కలిసి తిరిగారు. విదేశాల్లో ఎంజాయ్ చేశారు.ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ల పెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవిప్పుడు వైరల్ గా మారాయి.
తమిళనాడులోని మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్ హోటల్ లో పెళ్లి వేడుక అదిరిపోయేలా జరిగింది. నయన్ పెళ్లికి తమిళనాడు కు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రజినీకాంత్, సూర్య, అజిత్ తోపాటు బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్, బోనీకపూర్, అట్లీ కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
హోటల్ లోకి బయట వారిని రాకుండా క్యూఆర్ కోడ్ సిస్టం పెట్టి అతిథులకు వారిని అందజేశారు. చివరకు అతిథులకు ఇచ్చే వాటర్ బాటిళ్లు, కర్చీఫ్ లకు కూడా నయన్-విఘ్నేష్ ఫొటోలు ప్రింట్ చేశారు. నయనతార అన్నీ దగ్గరుండి ఈ పెళ్లి ఏర్పాట్లు చేశారు.
ప్రతీదాంట్లోనూ ఆమె ముద్ర వేశారు. ఇక విఘ్నేష్ శివన్ తనకు కాబోయే భార్య నయనతార కోసం 5 కోట్లు వెచ్చి బంగారం, ఉంగరాలు ఇతర పెళ్లి వస్తువులు స్వయంగా కొనుగోలు చేశాడు. ఇక నయనతార ధరించే గద్వాల్ చీర ధర కూడా రూ.5 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. బంగారు దారాలతో చేసిన ఈ చీరను నయనతార పెళ్లిలో ధరించింది.
నయనతార తన పెళ్లి హక్కులను నెట్ ఫ్లిక్స్ కు కట్టబెట్టింది. ఇక వీరి పెళ్లి వీడియోను సినిమాలా తీసే బాధ్యతను ప్రముఖ దిగ్గజ దర్శకుడు గౌతమ్ మీనన్ కు అప్పజెప్పింది. గౌతమ్ మీనన్ కు చెందిన కంపెనీ, అతడి టెక్నికల్ యూనిట్ ఈ పెళ్లి వేడుకను వీడియో, ఫొటోగ్రపీ బాధ్యత తీసుకుంది. వీరి పెళ్లి వీడియోను నెట్ ఫ్లిక్స్ లో రెండు పార్టులుగా ప్రసారం కానుంది. పెళ్లి వీడియోను రూ.2.5 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. విఘ్నేష్ , నయనతార లైఫ్ స్టోరీని ఇందులో టెలికాస్ట్ చేస్తారు. ఇలా పెళ్లి ఘనంగా చేసుకోవడమే కాదు.. దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడం నయనతారకే చెల్లింది. రూపాయి ఖర్చు లేకుండా అమ్మడు తన క్రేజ్ ను ఇలా వాడుకుందని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.