Homeఎంటర్టైన్మెంట్‘NBK 107’ Teaser: బాలయ్య నరకడం మొదలుపెడితే ఇలాగుంటది!

‘NBK 107’ Teaser: బాలయ్య నరకడం మొదలుపెడితే ఇలాగుంటది!

‘NBK107 Teaser  : టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలయ్య స్టైలే వేరు. మాస్ కు అసలైన నిర్వచనంలా కనిపిస్తారు. బాలయ్య చేసిన రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీలు ఆయనను ఓ రేంజ్ కు తీసుకెళ్లారు. మాస్ మసాలా మూవీల్లో బాలయ్య విశ్వరూపం చూపించాడు. సింహా, లెజెండ్ లాంటి హైఓల్టేజ్ మూవీలు బాలయ్యకు మంచి ఊపు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ మరో సినిమాను లాంచ్ చేశాడు.

బాలకృష్ణ పుట్టునరోజు(జూన్ 10) సందర్భంగా ఆయన అభిమానులకు ఒకరోజు ముందుగానే అదిరిపోయే కానుక లభించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా చేస్తున్న ఇంకా పేరు పెట్టని ‘ఎన్బీకే 107’ మూవీ టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ వర్కింగ్ టైటిల్ తో రిలీజ్ అయిన ట్రైలర్ దుమ్ము రేపుతోంది.

బాలకృష్ణ లుక్, ఆయన చెప్పిన డైలాగులు చూస్తే అచ్చం ‘సింహ’ సినిమా మాదిరే ఉంది. లుంగీ కట్టుకొని ఫైట్లు చేస్తున్న తీరు అదిరిపోయింది. పులిచర్ల నేపథ్యంలో పవర్ ఫుల్ యాక్షన్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు టీజర్ చూస్తుంటే అర్తమవుతోంది.

‘నేను నరకం మొదలుపెడితే బాడీలు పెళ్లాలకు కూడా తెలియవట?’ అంటూ విలన్లకు బాలయ్య ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ అదిరిపోయేలా ఉంది. బాలయ్య అభిమానులు ఆశించే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది.

శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. పవర్ ఫుల్ గా ఉన్న డైలాగులను బుర్రా సాయిమాధవ్ అందించారు. బాలయ్య పుట్టినరోజు మాస్ కు పూనకం తెప్పించేలా ఈ టీజర్ ఉంది. ఒక గ్రామంలో సమస్యలపై విలన్లతో ఎదురించే పోరాడే ఊరి పెద్దమనిషిగా ఇందులో బాలయ్య కనిపించాడు. టీజర్ తోనే సినిమాపై ఫుల్ హైప్ పెంచేశాడు బాలయ్య..

-ఎన్బీకే 107’ మూవీ టీజర్

Recommended Videos:
అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇవ్వబోతున్న బాలయ్య | Balakrishna Unexpected Surprise To His Fans @NBK61

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version