Star Heroine: ఈ నటి భర్త చేతిలో ఈమె చాలా దారుణంగా మోసపోయింది. తన భర్త మరో నటితో ఎఫైర్ పెట్టుకోవడంతో రెడ్ హ్యాండెడ్ గా వాళ్లను పట్టుకుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఆమె దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న టెలివిజన్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై ఈ నటి ఒక ఫైర్ బ్రాండ్. ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషకం తీసుకునే స్టార్ నటిగా ఎదిగింది. భాషతో సంబంధం లేకుండా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఉన్నాయి. కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే ఈమె ఒక నటుడిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. కానీ తన భర్త మరో నటితో ఎఫైర్ పెట్టుకోవడంతో వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని భర్త చెంప చెల్లుమనిపించింది. ఆ తర్వాత భర్తతో విడాకులు తీసుకొని ప్రస్తుతం ఈ నటి కొడుకుతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది. వరుస సీరియల్స్ మరియు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఆమె మరెవరో కాదు జెన్నీఫర్ వింగట్. ఈమె ప్రముఖ బాలీవుడ్ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి దిల్ మిల్ గయే సీరీస్లో నటించింది. ఆ సమయంలోనే ప్రేమించుకున్న వీళ్లిద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్నాళ్ళకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2014లో విడాకులు తీసుకొని విడిపోయారు. భర్తతో విడిపోయిన తర్వాత జెన్నీఫర్ జీవితంపై ఒత్తిడి ఏర్పడింది.
ఆమె ఎక్కడికి వెళ్లకూడదని, ఏమి చేయకూడదని చాలామంది ఆమెను చాలా మాటలు అన్నారని అలాగే తన నిర్ణయాలను అనేకమంది ప్రశ్నించారని కానీ వాళ్ళ మాటలను వినకుండా తాను తిరిగి నటిగా తన కెరియర్ ప్రారంభించినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో జెన్నీఫర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జెన్నీఫర్ బుల్లితెర మీద అత్యధిక పారితోషకం తీసుకుంటున్న వాళ్లలో ఒకరు. అయితే ఆమె ప్రేమ కోసం తన కెరియర్ను వదులుకోవడానికి సిద్ధపడటంతో ఆమె అభిమానులు ఆశ్చర్యపోయారు.
ఈమె తొలిసారిగా 1995లో అమీర్ ఖాన్, మనీషా కొయిరాలా జంటగా నటించిన అకేలే హమ్ ఆకేలే తుమ్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఐశ్వర్యారాయ్ నటించిన కుచ్ నాకహో సినిమాలో కూడా నటించింది. బుల్లితెర మీద జెన్నిఫర్ కసోటి జిందగీ కి, సరస్వతి చంద్ర, బెహద వంటి సీరియల్స్ తో బాగా పాపులర్ అయ్యింది. విడాకుల తర్వాత జెన్నీఫర్ భర్త 2016లో బిపాషా బస్సును పెళ్లి చేసుకున్నాడు.