https://oktelugu.com/

Kriti Shetty : భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి..ఇక ఈమె తలరాత మారినట్టే!

ఈ సమయంలో ఒక పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఈమెకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే డైరెక్టర్ సుకుమార్ తో ఒక పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపిక అయ్యిందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్

Written By:
  • Vicky
  • , Updated On : October 16, 2024 / 05:01 PM IST

    Kriti Shetty

    Follow us on

    Kriti Shetty : ఉప్పెన’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని ఇండస్ట్రీ లోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన హీరోయిన్ కృతి శెట్టి. ఈమెకు ఈ సినిమా ద్వారా యూత్ ఆడియన్స్ లో ఏర్పడిన క్రేజ్ మామూలుది కాదు. ఈ సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ‘ఉప్పెన’ తర్వాత ఆమె నానితో చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన బంగార్రాజు చిత్రం కూడా హిట్ అయ్యింది. అలా వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి శెట్టి పై ఎవరి దిష్టి పడిందో తెలియదు కానీ, వరుసగా ఫ్లాప్స్ రావడం మొదలు పెట్టింది. ఎంత తొందరగా అయితే ఈమె ఎదిగిందో, అంతే తొందరగా క్రిందకి పడిపోయింది.

    చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో పాటు, అదే సమయంలో శ్రీలీల ఇండస్ట్రీ లోకి రావడంతో ఈమె అవకాశాలకు గండి పడింది. ఇప్పుడు ఈమె చేతిలో ఒకటి రెండు చిత్రాలు తప్ప, ఇంకేమి లేవు. కుర్ర హీరోలు కూడా ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తున్న ఈ సమయంలో ఒక పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఈమెకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే డైరెక్టర్ సుకుమార్ తో ఒక పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపిక అయ్యిందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఇప్పటికే ఈమె రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మళ్ళీ రెండవసారి కూడా రామ్ చరణ్ తో కలిసి నటించబోతుంది. అయితే కృతి శెట్టి కి ఈ చిత్రం లో సెకండ్ హీరోయిన్ రోల్ దొరికినట్టు లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా, నెగటివ్ షేడ్స్ తో ఉంటుందట.

    ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా విడుదల తర్వాత ఆయన రామ్ చరణ్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ప్రారంభించబోతున్నాడు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అవకాశాలు లేని సమయంలో కృతి శెట్టి కి ఏకంగా ఇంత పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం రావడం, అది కూడా నెగటివ్ రోల్ అవ్వడం ఆమెకు దక్కిన అదృష్టం గా భావించవచ్చు. ఈ సినిమా హిట్ అయితే ఆమె కెరీర్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో మలుపు తిప్పుకుంటుంది. అంతే కాదు అనేక సందర్భాలలో కృతి శెట్టి రామ్ చరణ్ నా ఫేవరెట్ హీరో అని చెప్పిన సంగతి తెలిసిందే. తన అభిమాన హీరో సినిమాలో కెరీర్ క్లిష్ట సమయంలో మంచి రోల్ దొరకడం నిజంగా ఆమె అదృష్టమే.