Sleep : రోజూ 50 కోట్ల చర్మ కణాలు శరీరం నుంచి ఊడిపోతాయి. ఇవి డస్ట్ మైట్‌లకు మంచి విందు భోజనం. ఆ పురుగుల కారణంగా, వాటి విసర్జితాల కారణంగా అలర్జీ, ఉబ్బసం, ఎగ్జిమా వంటి సమస్యలు వస్తుంటాయి. బెడ్‌షీట్‌లు కూడా బ్యాక్టీరియాకు మంచి ఆశ్రయాలుగా ఉంటున్నాయి. 2013లో, ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ పాశ్చర్ డి లిల్లే పరిశోధకులు హాస్పిటల్‌లోని పేషెంట్‌ల బెడ్‌షీట్ల మీద కూడా అధ్యయనం చేశారు. ఈ బెడ్ షీట్ లు స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియాతో నిండి ఉన్నాయట. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా మానవ చర్మంపై కనిపిస్తుంది.
చాలా స్టెఫిలోకాకస్ జాతులు పెద్దగా హాని కలిగించేవి కాకపోయినా, ఎస్. ఆరియస్ వంటివి హానీ తలపెడతాయి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వారికి చర్మ వ్యాధులు, మొటిమలు, న్యుమోనియా వంటి సమస్యలకు కారణం అవుతాయి. బ్యాక్టీరియా అనేది ప్రజల స్కిన్ మైక్రోబయోమ్‌లో భాగంగా ఉంటుంది. ఇవి చర్మం నుంచి పడిపోతుంటాయన్నారు యూకేలోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న మైక్రోబయాలజిస్ట్ మనల్ మహమ్మద్.
ఈ బ్యాక్టీరియా ప్రమాదకరం కాదట. కానీ బయటి గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే మాత్రం తీవ్రమైన సమస్యలు వస్తాయి. రోగుల బెడ్‌షీట్‌లు, దిండు కవర్లను తరచుగా మారుస్తుంటారు. సో అక్కడే చాలా డేటా లభిస్తుంది. 2018లో, నైజీరియాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇబాడాన్ శాస్త్రవేత్తలు ఉతకని హాస్పిటల్ బెడ్‌షీట్లలో మూత్ర నాళాల ఇన్‌ఫెక్షన్లు, న్యుమోనియా, డయేరియా, మెనింజైటిస్, సెప్సిస్‌లకు కారణమయ్యే ఇతర వ్యాధికారక బ్యాక్టీరియాతో పాటు ఈ. కొలిని కనుగొన్నారు.
2022లో మంకీపాక్స్‌తో ఆసుపత్రిలో చేరిన రోగుల గదుల నుంచి కూడా నమూనాలను సేకరించారట. బెడ్‌షీట్లను మార్చే క్రమంలో గాలిలోకి వైరస్ కణాలు విడుదల అవుతున్నట్లు వారు గుర్తించారు. 2018లో ఒక ఎంపాక్స్ రోగి పరుపును మార్చే క్రమంలో, ఒక యూకే హెల్త్‌కేర్ వర్కర్ ఆ వైరస్ కారణంగా ఆ వ్యాధి బారిన పడినట్లు భావిస్తున్నారు. ఆసుపత్రులలో చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బెడ్‌షీట్లను ఉతుకుతారు. దీని వల్ల చాలా బ్యాక్టీరియా నశిస్తుందన్నారు యూకేలోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డేవిడ్ డెన్నింగ్. సి. డిఫిసిల్ అనేది అతిసారం కలిగించే బాక్టీరియా. దీని ప్రభావం ముఖ్యంగా వృద్ధులలో ఎక్కువగా ఉంటుంది. బెడ్‌షీట్లను ఉతకాలి. దీని వల్ల సి.డిఫిసిల్ బ్యాక్టీరియా సగం వరకు నాశనం అవుతుందట.