Kriti Shetty : ఉప్పెన మూవీతో కృతి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. వరుస హిట్స్ ఇచ్చి హ్యాట్రిక్స్ పూర్తి చేసింది. 2021 సెన్సేషనల్ హిట్ గా ఉన్న ఉప్పెన స్టార్ హీరోల రేంజ్ వసూళ్లు రాబట్టింది. డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు, డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ తో ఈ మ్యాజిక్ చేశాడు. హిట్ క్రెడిట్ లో అధిక భాగం కృతి శెట్టికి ఇవ్వాల్సిందే. ఆ తర్వాత దేవీ శ్రీ ప్రసాద్. టీనేజ్ లో ఉన్న కృతి ఆ పాత్రకు చక్కగా సరిపోయారు. ఆమె గ్లామర్ మెస్మరైజ్ చేసింది. మొత్తంగా బ్లాక్ బస్టర్ ఆవిష్కృతమైంది.