Amitabh Bachchan: పెళ్లి చేసి చూడు – ఇల్లు కట్టి చూడు అన్న సామెత ఊరికే రాలేదు. ఈ రెండిటికి అంచనాలకు మించిన ఖర్చులుంటాయి, ఒక్కసారిగా అవి మనిషిని కృంగదీస్తాయి. పైగా ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఓ కల. సామాన్యుడు అయినా, ప్రముఖులు అయినా తమ స్థాయికి తగ్గట్టుగా తమ స్తోమతకు తగ్గట్టుగా ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ముంబైలో ఇల్లు కొనుక్కోవడం అంటే మాటలు కాదు.

ఎంత స్టార్లు అయినా ఇల్లు కావాలి అంటే కోట్లు కోట్లు ఖర్చు చేయాలి. పైగా స్టార్లు ఉండే ప్రాంతంలో మంచి అపార్ట్మెంట్ కొనాలంటే కనీసం 11 కోట్లు గుమ్మరించాలి. ఎంతటి స్టార్ హీరో అయినా ఒక్కసారిగా అంత ఎమౌంట్ ఇంటికే పెట్టడానికి రిస్క్ చేయరు. అందుకే, చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు అపార్ట్ మెంట్లను రెంట్ కి తీసుకుని ఉంటారు.
తాజాగా గ్లామర్ బ్యూటీ కృతి సనన్ కూడా కొత్త అద్దె ఇంట్లోకి షిఫ్ట్ అయింది. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది అంటే.. అమితాబ్ బచ్చన్ కి చెందిన అపార్ట్ మెంట్ అది. ఆ రోజుల్లో అమితాబ్ చేసిన మంచి బిజినెస్ ల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. అప్పట్లో తక్కువ రేటుకే స్థలాలు కొనేసి.. బిల్డింగ్ లు కట్టించాడు. అందుకే అమితాబ్ బచ్చన్ కి ముంబై లాంటి మహానగరంలో చాలా అపార్ట్ మెంట్ లున్నాయి.
ఆ అపార్ట్ మెంట్ లు అన్నీ రెంట్ కి ఇచ్చారు. ఈ క్రమంలోనే అమితాబ్ కి చెందిన ఓ అపార్ట్ మెంట్ ఖాళీగా ఉందని కృతి సనన్ కి తెలిసింది. వెంటనే ఏరికోరి అమితాబ్ కి చెందిన అపార్ట్మెంట్ ని అద్దెకు తీసుకొని అందులోకి షిఫ్ట్ అయిపోయింది కృతి సనన్. రీసెంట్ గా “మిమి” అనే సినిమాలో నటించి నటన పరంగా మంచి పేరు తెచ్చుకుంది.
కాకపోతే బాక్సాఫీస్ వద్ద మిమి సినిమా బలిపశువు అయింది అనుకోండి. ఇక కృతి ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి గానూ అమ్మడు నాలుగు కోట్లు తీసుకుంటుంది. కృతి బాగానే సంపాదిస్తోంది. ఎలాగూ 2 కోట్లు పెట్టి ఈ మధ్యే ఒక రిచ్ కారు కొనుక్కొంది కాబట్టి.. రానున్న రోజుల్లో ఇల్లు కూడా కొనుక్కుంటుంది.