8 Movies Releasing: ఒకేరోజు 8 సినిమాలు రిలీజ్.. కానీ అన్నీ వాష్ అవుటే !

8 Movies Releasing: తెలుగు సినిమా బాక్సాఫీస్ కి నిన్న గ్రహణం పట్టింది. చాలా గ్యాప్ తర్వాత ఒకే రోజు ఏకంగా 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో రిలీజ్ ల పరంగా ఇది రికార్డు. కానీ, విచిత్రంగా ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఈ శుక్రవారం ఏ సినిమా మెప్పించలేక పోవడంతో బాక్సాఫీస్ దగ్గర బాగా వెలితిగా అనిపించింది. అసలు హిట్ మాట దేవుడెరుగు.. కనీసం కనీస బజ్ ను కూడా […]

Written By: Shiva, Updated On : June 27, 2022 1:23 pm
Follow us on

8 Movies Releasing: తెలుగు సినిమా బాక్సాఫీస్ కి నిన్న గ్రహణం పట్టింది. చాలా గ్యాప్ తర్వాత ఒకే రోజు ఏకంగా 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో రిలీజ్ ల పరంగా ఇది రికార్డు. కానీ, విచిత్రంగా ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఈ శుక్రవారం ఏ సినిమా మెప్పించలేక పోవడంతో బాక్సాఫీస్ దగ్గర బాగా వెలితిగా అనిపించింది. అసలు హిట్ మాట దేవుడెరుగు.. కనీసం కనీస బజ్ ను కూడా ఏ చిత్రం క్రియేట్ చేయలేకపోయింది. బజ్ లేనప్పుడు ఓపెనింగ్స్ రావు. బాక్సాఫీస్ బోసిపోవడానికి ఇదే ప్రధాన కారణమైంది.

Sammathame, Chor Bazaar movie

రిలీజైన 8 చిత్రాల్లో ఏ చిత్రానికి వసూళ్లు రాలేదు. ఏ సినిమాకు ఏవరేజ్ టాక్ కూడా రాలేదు. కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ సినిమా ట్రైలర్ బాగుంది. సినిమా హిట్ అవుతుంది అందుకున్నారు. కానీ.. సినిమా బిగ్గెస్ట్ ప్లాప్ అయ్యింది. ఆకాష్ పూరి హీరోగా వచ్చిన ‘చోర్ బజార్’ సినిమా అయితే కలెక్షన్స్ పరంగా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యింది. ఈ రెండు సినిమాలకు కాస్త గట్టిగా ప్రచారం చేశారు. దాదాపు 3 వారాల ముందు నుంచే ప్రమోషన్స్ చేశారు.

Also Read: Vikram 3 Weeks Collections: కమల్ కెరీర్ లోనే మిరాకిల్ ఇది !

ఈ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే.. థియేటర్లకు జనాలు ఈజీగా వస్తారు. పైగా కిరణ్ అబ్బవరం ఫ్రీ-టికెట్ స్క్రీమ్ కూడా పెట్టాడు. ఇక ఆక్యుపెన్సీ విషయంలో తన సినిమాకు ఏ డోకా లేదు అని కిరణ్ నమ్మకంగా కనిపించాడు. కట్ చేస్తే.. ఆక్యుపెన్సీ ఏ మాత్రం పెరగలేదు. థియేటర్లకు జనాలు రాలేదు. కిరణ్ అబ్బవరం ఫ్రీ-టికెట్ స్క్రీమ్ ఫెయిల్ అయ్యింది. దీనిబట్టి.. సినిమాలో మ్యాటర్ లేకపోతే.. ఎదురు డబ్బులు ఇచ్చినా సినిమా చూడటానికి ప్రేక్షకులు రెడీగా లేరు అని అర్థం చేసుకోవాలి.

7 Days 6 Nights

అందుకే, మొదటి రోజు సమ్మతమే సినిమాకు 68 లక్షల షేర్ కంటే ఎక్కువ రాలేదు. చోర్ బజార్ సినిమాకు 40 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఈ సినిమాల ప్రమోషన్స్ కోసమే కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. దీనిబట్టి ఈ సినిమాలకు భారీ నష్టాలు తప్పేలా లేవు. ఇక ఎమ్మెస్ రాజు తీసిన ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాకు 9 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇది రాజుగారికే అవమానం.

మిగిలిన సినిమాలన్నీ పరిపూర్ణంగా వాష్ అవుట్ అయ్యాయి. ఆ సినిమాల లిస్ట్ లో ఆర్జీవీ తీసిన కొండా సినిమాతో పాటు.. గ్యాంగ్ స్టర్ గంగరాజు, సదా నన్ను నడిపే, కరణ్ అర్జున్, సాఫ్ట్ వేర్ బ్లూస్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల కలెక్షన్స్ చూస్తే.. పోస్టర్లకు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రాలేదు. ఓవరాల్ గా థియేటర్ల పరిస్థితే.. ప్రస్తుతం బాగాలేదు. మేజర్ సినిమా, విక్రమ్ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ రాబట్టలేక పోయాయి. ఎందుకో టికెట్ రేట్లు తగ్గించినా.. జనాలు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇలాగే కొనసాగితే.. చిన్న హీరోల సినీ కెరీర్ చితికిపోతుంది.

Also Read:Mehreen Viral: నడిరోడ్డుపై ‘మెహ్రీన్’ చిందులు.. వీడియో వైరల్
Recommended Videos


Tags