తమిళ క్రియేటివ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో హీరో రామ్ పోతినేని తన కొత్త సినిమా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూట్ కి కూడా వెళ్ళబోతుంది. తమిళ్, తెలుగు భాషల్లో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకుంటారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కృతి శెట్టి ప్రస్తుతం ‘ఉప్పెన’ ప్రొమోషన్ తో బిజీగా ఉంది కాబట్టి, త్వరలోనే ఆమె డేట్స్, పారితోషికం గురించి మాట్లాడి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న మాట.
Also Read: అఖిల్ కోసం బికినీ వేస్తోన్న పూజ హెగ్డే !
అయితే కృతి శెట్టికి ‘ఉప్పెన’ విడుదలకు ముందే వరుస అవకాశాలు వచ్చాయి. ఆల్ రెడీ నాని సరసన నటించే ఛాన్స్ ని కూడా అందుకొని నానితో షూట్ లో కూడా పాల్గొంది. అలాగే సుధీర్ బాబు సరసన కూడా నటిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. ఇప్పుడు రామ్ మూవీ కూడా ఫిక్స్ ఐతే… కృతి శెట్టికి స్టార్ డమ్ పెరగడం ఖాయమే. పైగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకునే ఆలోచనలో ఉంది టీమ్.
Also Read: 100 కోట్ల క్లబ్ లో మెగా మేనల్లుడు !
కాగా పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమా, ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో త్రివిక్రమ్ ఈ సినిమా కథ రాసుకున్నాడని.. ఇందులో సెకెండ్ హీరోయిన్ ది పిచ్చి పట్టిన క్యారెక్టర్ అని, ఆ పాత్రలో మంచి నటి అయితేనే ఆ క్యారెక్టర్ పండుతుందని.. అందుకే కృతి శెట్టికి త్రివిక్రమ్ అవకాశం ఇస్తున్నాడట. ఉప్పెన సినిమాలో ఆమె నటన ఎన్టీఆర్ కి కూడా బాగా నచ్చిందట. ఏది ఏమైనా ఎన్టీఆర్ సరసన అదీ పాన్ ఇండియా మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తే.. వచ్చే ఏడాదికి ఆమె నెంబర్ వన్ హీరోయిన్ అవ్వడం ఖాయం.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్