https://oktelugu.com/

అఖిల్ కోసం బికినీ వేస్తోన్న పూజ హెగ్డే !

అక్కినేని వంశం నుండి నాగేశ్వరరావు , నాగార్జునల తరువాత నాగచైతన్య క్లాస్ అండ్ రొమాంటిక్ సినిమాలతో తన శైలిలో వాళ్ళ దారిలోనే పయనిస్తున్నాడు. కానీ అక్కినేని అఖిల్ కి మాత్రం ఆ దారి అందనంత దూరంలో ఉంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ అనే సినిమాతో గ్రాండ్ గా కెరీర్ ను మొదలుపెట్టినా.. అఖిల్ కు ఆ సినిమా ఫలితం భారీ షాక్ ను ఇచ్చింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఆ సినిమా బడ్జెట్ లో సగం […]

Written By:
  • admin
  • , Updated On : February 27, 2021 / 06:35 PM IST
    Follow us on


    అక్కినేని వంశం నుండి నాగేశ్వరరావు , నాగార్జునల తరువాత నాగచైతన్య క్లాస్ అండ్ రొమాంటిక్ సినిమాలతో తన శైలిలో వాళ్ళ దారిలోనే పయనిస్తున్నాడు. కానీ అక్కినేని అఖిల్ కి మాత్రం ఆ దారి అందనంత దూరంలో ఉంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ అనే సినిమాతో గ్రాండ్ గా కెరీర్ ను మొదలుపెట్టినా.. అఖిల్ కు ఆ సినిమా ఫలితం భారీ షాక్ ను ఇచ్చింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఆ సినిమా బడ్జెట్ లో సగం కూడా రికవరీ చేయలేకపోయింది. ఆ తరువాత చేసిన సినిమాల బాగోతాలు అలాగే ఉన్నాయి. ఇక అఖిల్ కి ఒక్క హిట్ కూడా రాదా అనే స్థాయికి అఖిల్ రేంజ్ పడిపోయింది.

    Also Read: సంక్రాంతికి టగ్ ఆఫ్ వార్‌.. బ‌రిలో ప‌వ‌న్ – మ‌హేష్‌..?

    నిజానికి హిట్ కోసం అఖిల్ చేయని ప్రయత్నం లేదు. అయినా పాపం అఖిల్ కి ఏదీ కలిసి రావట్లేదనే అనుకోవాలి. వరుసగా మూడు సినిమాలు సరైన బ్రేక్ తీసుకురాకపోగా ఉన్న ఇమేజ్ ను కూడా డ్యామేజ్ చేశాయి. అందుకే, చిన్నగా గీతా ఆర్ట్స్ క్యాంపులో చేరాడు. నాలుగో సినిమాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చేస్తున్నాడు. సినిమా ఎప్పుడో పూర్తి అయింది. పైగా ఇప్పటికే పలుసార్లు రీషూట్లు, రిపేర్లు కూడా జరుపుకొంది. అయినా ఈ మూవీ అవుట్ ఫుట్ పై మాత్రం ఎవ్వరికీ నమ్మకం రావడం లేదట.

    ఇప్పటివరకు రెండు పాటలు కూడా విడుదల చేశారు. టీజర్స్ వచ్చాయి. కానీ ఎక్కడా సినిమాకి క్రేజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఫుల్ ఫాలోయింగ్ తో లక్కీ హీరోయిన్ గా చలామణి అవుతున్న పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్నా.. ఈ సినిమాకి మాత్రం అంచనాలు లేకుండా పోయాయి. సినిమా టీజర్ ని కూడా జనం మర్చిపోయారు. అన్నట్లు జూన్ లో విడుదల కానుంది ఈ సినిమా.

    Also Read: ‘ఉప్పెన’ హీరోయిన్ తో సుధీర్ ప్రేమ

    కాబట్టి రిలీజ్ కు ముందు సినిమా పై బజ్ పెరగాలంటే.. ఏదోకటి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే పూజ హెగ్డేతో బికినీ వేయించాలని, ఆ పోస్టర్స్ ను రిలీజ్ కి ముందే వదలాలని అఖిల్ టీమ్ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారట. మొత్తానికి అఖిల్ హిట్ కోసం పూజా బికినీ వేయబోతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్